Last Updated:

Stock Markets: వరుస లాభాల జోరుకు బ్రేక్.. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు సాయంత్రం వేళకు నష్టాలను చవిచూశాయి. స్టాక్ మార్కెట్లలో వరుస లాభాల జోరుకు బ్రేక్ పడింది.

Stock Markets: వరుస లాభాల జోరుకు బ్రేక్.. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Markets: ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు సాయంత్రం వేళకు నష్టాలను చవిచూశాయి. స్టాక్ మార్కెట్లలో వరుస లాభాల జోరుకు బ్రేక్ పడింది. గత ఎనిమిది రోజులుగా ప్రతి రోజు గరిష్ఠ స్థాయిలను నమోదు చేస్తూ వచ్చిన మార్కెట్లు ఈరోజు నష్టపోయాయి. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో నష్టాలను చవిచూశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 415 పాయింట్లు నష్టపోయి 62,868కి పడిపోగా, నిఫ్టీ 116 పాయింట్లు పతనమై 18,696కి దిగజారింది.

టాటా స్టీల్ (1.22%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (1.18%), టెక్ మహీంద్రా (1.16%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.56%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.35%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.

ఇదీ చదవండి: మెదడులో చిప్‌.. మస్క్‌ మరో సంచలనం

ఇవి కూడా చదవండి: