Last Updated:

Janasena-TDP Action Committee: రాజమండ్రిలో జనసేన – టీడీపీ తొలి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం

రాజమండ్రిలో జనసేన - టీడీపీ సమన్వయ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి జనసేనాని పవన్ కళ్యాణ్, టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన కమిటీ తొలి సమావేశం జరిగింది. కామన్ మినిమమ్ ప్రోగ్రాం సహా ఆరు అంశాలతో అజెండా ఖరారు చేశారు.

Janasena-TDP Action Committee: రాజమండ్రిలో జనసేన – టీడీపీ తొలి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం

Janasena-TDP Action Committee: రాజమండ్రిలో జనసేన – టీడీపీ సమన్వయ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి జనసేనాని పవన్ కళ్యాణ్, టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన కమిటీ తొలి సమావేశం జరిగింది. కామన్ మినిమమ్ ప్రోగ్రాం సహా ఆరు అంశాలతో అజెండా ఖరారు చేశారు. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చించారు. తదుపరి భేటీలు ఉత్తరాంధ్ర, రాయలసీమలో జరపాలని నిర్ణయించారు. వివిధ సమస్యలపై ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.

జనసేన – టీడీపీ అజెండా ఖరారు..(Janasena-TDP Action Committee)

చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ సమన్వయ కమిటీ తీర్మానం చేసింది. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని నేతలు అభిప్రాయపడ్డారు. మొత్తంగా ఆరు అంశాలతో జనసేన – టీడీపీ అజెండా ఖరారు చేశారు. రాష్ట్రస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు సమన్వయంపై చర్చించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలు, అవినీతిపై ఛార్జిషీట్ రూపొందించాలని తీర్మానించారు. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాట ప్రణాళికపై సమన్వయ కమిటీ చర్చించింది. ఈ నెల 27న ఓటర్ తొలి ముసాయిదా ప్రకటనపై సమన్వయ కమిటీ సమాలోచనలు చేసింది. ఉమ్మడి జిల్లా, పార్లమెంట్, అసెంబ్లీ, మండల స్థాయిలో సమన్వయ కమిటీల ఏర్పాటుపై చర్చ జరిగింది. రెండు పార్టీల మధ్య పొత్తుతో ఎక్కడైనా ఇబ్బందులున్నా పరిష్కరించేలా కమిటీలకు బాధ్యతలు అప్పగించారు. రెండు పార్టీలనుంచి ఇంఛార్జులుగా ఉన్న వారు సమన్వయం చేసుకోవాలని నిర్ణయించారు. సీటు ఆశించి పొత్తు వల్ల రాదనుకునే వారితో కమిటీలు చర్చలు జరపనున్నాయి. విడివిడిగాను, ఉమ్మడిగానూ ఉద్యమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రైతు సమస్యలు, కరువుపై ప్రధానంగా దృష్టి పెట్టాలని నిర్ణయించారు.

ఈ సమావేశంలో జనసేన తరపున నాదెండ్ల  మనోహర్, కందుల దుర్గేష్, మహేంద్ర రెడ్డి, కొటికలపూడి గోవిందరావు, పాలవలస యశస్విని, బొమ్మిడి నాయకర్ హాజరయ్యారు. టీడీపీ  తరపున మాజీ మంత్రులు సీనియర్ నాయకులు కే.అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు,  పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, రామానాయుడు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సమావేశానికి హాజరయ్యారు.