Nellore Student Murder : ఏలూరులో దారుణం.. నాలుగో తరగతి విద్యార్ధి కిడ్నాప్.. ఆపై హత్య..?
ఏలూరులో దారుణం చోటుచేసుకుంది. హాస్టల్ గదిలో నిద్రపోతున్న విద్యార్ధిని.. గుర్తు తెలియని అగంతకులు కిడ్నాప్ చేసి.. ఆపై హత్య చేసి స్కూల్ ఆవరణలోనే పడవేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాగా ఆ బాలుడి మృతదేహం చేతిలో మళ్ళీ ఇదే రిపీట్ అవుతుందని వార్నింగ్ లెటర్ పెట్టడం గమనార్హం.
Nellore Student Murder : ఏలూరులో దారుణం చోటుచేసుకుంది. హాస్టల్ గదిలో నిద్రపోతున్న విద్యార్ధిని.. గుర్తు తెలియని అగంతకులు కిడ్నాప్ చేసి.. ఆపై హత్య చేసి స్కూల్ ఆవరణలోనే పడవేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాగా ఆ బాలుడి మృతదేహం చేతిలో మళ్ళీ ఇదే రిపీట్ అవుతుందని వార్నింగ్ లెటర్ పెట్టడం గమనార్హం. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా బట్టాయిగూడెం మండలం పులిరామన్నగూడెం ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల అవరణలో ఈ ఘటన జరిగింది. ఉర్రింక గ్రామానికి చెందిన గోగుల శ్రీనివాస రెడ్డి , రామలక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదే స్కూల్ లో పెద్ద పిల్లవాడు హర్ష వర్ధన్ రెడ్డి 6వ తరగతి చదువుతున్నాడు. చిన్నవాడు అఖిల్ వర్ధన్ రెడ్డి (11) నాల్గవ తరగతి చదువుతున్నాడు.
అఖిల్ మూడవ తరగతి నుంచి ఈ హాస్టల్ లోనే ఉంటూ చదువుతున్నాడు. ఈ క్రమంలో తల్లితండ్రులు గత నెల 18న హాస్టల్లో దింపి వెళ్లారు. ఐతే నిన్నరాత్రి 10 గంటల తరువాత హాస్టల్ వార్డెన్ ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే రాత్రి సమయంలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు హాస్టల్ అఖిల్ నిద్రిస్తున్న గదిలోకి వచ్చారని , టార్చ్ లైట్ వేసుకుని అఖిల్ మొఖంపై వేసి అతడిని దుప్పట్లో చుట్టుకుని తీసుకుని వెళ్లారని సహచర పిల్లలు చెప్పినట్లు స్కూల్ హెచ్ .ఏం గంగరాజు మీడియాకు వెల్లడించారు.
అనంతరం హత్య చేసి సమీపంలోని గిరిజన సంక్షేమ పాఠశాల ఆవరణలో పడేశారు. మృతదేహంపై ఉన్న ఆనవాళ్లను బట్టి బాలుడిని గొంతు నులిమి హత్య చేసినట్టు తెలుస్తోంది. అనంతరం ఆ బాలుడి మృతదేహాన్ని హాస్టల్ కు 50 మీటర్ల దూరంలో ఉన్న స్కూల్ బిల్డింగ్ గ్రౌండ్ లో గుర్తించారు. అతడి కుడి కాలు మోకాలు ఎడమవైపుకు మడతపడి ఉండగా.. ఎడమకాలు కుడికాలుపై నిలువుగా ఉంది. కుడి చేయి చాపి ఉండగా చేతిలో ఒక లెటర్ ఉంది. అందులో “బ్రతకాలనుకున్న వారు వెళ్లిపోండి ఎందుకంటే ఇక నుండి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.. ఇట్లు మీ అని ఇంటూ మార్క్స్ రాశారు.
ఈ విషాద ఘటన సమాచారం అందుకొని ఘటనా స్థలానికి ఏపి గిరిజన సంక్షేమ శాఖ సభ్యుడు యు. శంకర్ నాయక్ , జిల్లా యస్పీ మేరీ ప్రశాంతి చేరుకుని విచారణ చేపట్టారు. మరో వైపు ఘటన లో నిర్లక్ష్యం వహించారని హెడ్మాస్టర్ ములేం గంగరాజు, వార్డెన్ కరకం శ్రీను, వాచ్మెన్ మట్టుం రాజేశ్ లను అధికారులు సస్పెండ్ చేశారు. వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది క్షుద్రపూజలు , ఇతర ఉద్దేశ్యపూర్వక కారణాలతో బయటవ్యక్తులు చేసిన పనికాదని పలువురు విద్యార్థి సంఘాలతో పాటు , గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాగా ఈ ఘటనలో హాస్టల్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం హాస్టల్ లో 172 మంది పిల్లలు 12 రూముల్లో ఉంటున్నారని వారి రక్షణ బాధ్యత ఎవరిదని ప్రజా సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. కాగా మరోవైపు ఇదే మండలం సరుగుడు గ్రామంలో 11 నెలల బాలుడు కొద్ది రోజుల క్రితం కిడ్నాప్ అయ్యాడు. అతడి ఆచూకీ ఇంకా లభించలేదు. దీంతో ఈ వరుస ఘటనలతో స్ధానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.