Hyderabad Crime News: హైదరాబాద్‌లో దారుణం.. లిఫ్ట్ ఇస్తామని చెప్పి జర్మనీ యువతిపై అత్యాచారం

German woman raped by cab driver on way to Hyderabad airport: హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ జర్మనీ యువతిపై యువకులు అత్యాచారం చేశారు. ఎయిర్ పోర్టుకు వెళ్తున్న యువతికి లిఫ్ట్ ఇస్తామని చెప్పి యువకులు కారులో ఎక్కించుకున్నారు. అక్కడి నుంచి మీర్‌పేట్ దగ్గరలోని మందమల్లమ్మ దగ్గర ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.
కాగా, పహాడీ షరీఫ్ పీఎస్‌లో ఆ విదేశీ యువి ఫిర్యాదు చేసింది. జర్మనీ యువతిపై అత్యాచారం కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి బాధిత యువతిని తరలించారు. ఈ మేరకు ఒక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.