Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. నడుస్తున్న రైలులో యువతిపై అత్యాచారయత్నం

A Man rape attempt to young women in Hyderabad MMTS Train: హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. నడుస్తున్న ఎంఎంటీఎస్ రైలులో ఓ యువకుడు యువతిపై అత్యాచారయత్నం చేశాడు. దీంతో ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక ఆ యువతి ఏకంగా నడుస్తున్న రైలులో నుంచి బయటకు దూకేసింది.
వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారానికి యువకుడు యత్నించాడు. మహిళా కోచ్‌లో యువతితో పాటు ఇద్దరు మహిళలు ఉన్నారు. అయితే ఆల్వాల్ స్టాప్ రాగానే ఆ ఇద్దరు మహిళలు దిగిపోయారు. దీంతో ఒంటరిగా ఉన్న ఆ యువతి దగ్గరికి ఓ యువకుడు వచ్చిఅత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో కొంపల్లి దగ్గర ఆ యువతి రైల్లోంచి దూకేసింది. యువతికి తీవ్రగాయాలయ్యాయి.
గుడ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో తీవ్ర గాయాలతో పడిపోయిన యువతిని చూసిన ఓ పాదచారుడు వెంటనే 108కు సమాచారం అందించాడు. వెంటనే ఆ యువతిని అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
కాగా, బాధితురాలి ఏపీలోని అనంతపురం జిల్లా ఉరవకొండగా పోలీసులు నిర్ధారించాడు. ఆ యువతి మేడ్చల్‌లో ఓ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటే స్విగ్గీలో పనిచేస్తుందని పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్‌లో తన ఫోన్ రిపేర్ చేసుకొని మేడ్చల్ వెళ్తుండగా రాత్రి 8.30 నిమిషాల సమయంలో జరిగిందని చెప్పింది.
మహిళల బోగిలోకి ఆ అంగతకుడు ప్రవేశించి తనపై అత్యాచారయత్నం చేసినట్లు పోలీసులతో బాధితురాలు వాపోయింది. ఆ అంగతకుడు గల్లచొక్కా వేసుకున్నాడని, నల్లగా సన్నగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. సుమారు 25 ఏళ్ల వయసు ఉండవచ్చని అంచనా వేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.