Traffic Jam: నగర శివార్లలో భారీగా ట్రాఫిక్ జాం…చేతులెత్తేసిన పోలీసులు
భారత్ జోడో యాత్ర హైదరాబాదు నగరంలో ఉత్సాహంగా సాగుతోంది. పాదయాత్ర సాగే క్రమంలో లింగంపల్లి చౌరస్తా నుండి ముత్తంగి వరకు భారీ కాన్వాయ్ ఓవైపుగా, మరో వైపు సాధారణ వాహనాలను దారి మళ్లించారు. వన్ వేలోనే రెండు వైపులా వాహనాలు వెళ్లే విధంగా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు.
Lingampally: భారత్ జోడో యాత్ర హైదరాబాదు నగరంలో ఉత్సాహంగా సాగుతోంది. పాదయాత్ర సాగే క్రమంలో లింగంపల్లి చౌరస్తా నుండి ముత్తంగి వరకు భారీ కాన్వాయ్ ఓవైపుగా, మరో వైపు సాధారణ వాహనాలను దారి మళ్లించారు. వన్ వేలోనే రెండు వైపులా వాహనాలు వెళ్లే విధంగా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు.
ఇక్రిశాట్ దాటిన తర్వాత ఓ బాలుడితో రాహుల్ గాంధీ రోడ్డుపై క్రికెట్ ఆడారు. దీంతో కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అనంతరం పటాన్ చెరు ఆనంద్ భవన్ హోటల్లో 20నిమిషాల పాటు రాహుల్ సేద తీరారు. ఆ సమయంలో కార్యకర్తల రద్దీ కారణంగా ట్రాఫిక్ ఏర్పడింది.
అనంతరం రాహుల్ గాంధీ పాదయాత్ర ముందుకు సాగిన్నప్పటికీ రహదారి రెండు వైపుల వాహనాల రద్దీమాత్రం కొనసాగింది. అనంతరం ముత్తంగిలో రాహుల్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. దీంతో పటాన్ చెరు వైపు దాదాపుగా 5 కి.మీ మేర ట్రాఫిక్ ఆగిపోయింది. ట్రాఫిక్ ను నియంత్రించలేక పోలీసులు కూడా చేతులెత్తేశారు. రాహుల్ గాంధీ పర్యటన ఉన్నప్పటికీ ప్రధాన రోడ్డుపై ఉన్న ఆక్రమణలను తొలగించడంలో పోలీసులు పూర్తిగా విఫలం చెందారు. మరోవైపు పోలీసులు పేర్కొన్నట్లుగా ఎక్కడా ట్రాఫిక్ నిబంధనలు అమలు కాకపోవడంతో వాహనదారులు ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేస్తు ఆటంకాలు కల్పిస్తున్నారు. సిటీ బస్సులు బేలలో కాకుండా ప్రధాన రోడ్డుపై నిలపడంతో పలు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇది కూడా చదవండి: Traffic Restrictions: నేడు భాగ్యనగరంలోని ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు