Last Updated:

Traffic Restrictions: నేడు భాగ్యనగరంలోని ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్లో నేడు రాహుల్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ జోడో యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా భాగ్యనగరంలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని మాదాపూర్‌ ట్రాఫిక్‌ జోన్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు ఉండనున్నాయి.

Traffic Restrictions: నేడు భాగ్యనగరంలోని ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic Restrictions: హైదరాబాద్లో నేడు రాహుల్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ జోడో యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా భాగ్యనగరంలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని మాదాపూర్‌ ట్రాఫిక్‌ జోన్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు ఉండనున్నాయి.

ఈ రోజు ఉదయం 8:00 నుంచి సాయంత్రం 6:00 వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్‌ డీసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. కూకట్‌పల్లి అంబేడ్కర్‌ వై జంక్షన్‌ మూసివేసి ట్రాఫిక్‌ను దారి మళ్లించనున్నారు. యాత్ర ముగిసిన తర్వాత ఐడిఎల్‌ చెరువు వైపు, అంబేడ్కర్‌ వై జంక్షన్‌ తిరిగి ట్రాఫిక్‌ను పునరుద్దరించనున్నారు. కూకట్‌పల్లి నుంచి నిజాంపేట నుంచి ప్రగతినగర్‌ వెళ్లే వాహనదారులను జేఎన్‌టీయూ, ఫోరంమాల్‌ వైపు మళ్లించనున్నారు. చందానగర్‌ నుంచి మూసాపేట వైపు వెళ్లే ప్రయాణికులు పైపులైను రోడ్డు మూసి ఉంటుందని దాన్ని గమనించి రాకపోకలు దారి మళ్లించుకోవాలని డీసీపీ తెలిపారు. కొండాపూర్‌ నుంచి వయా అల్విన్‌ జంక్షన్‌ మీదుగా బీహెచ్‌ఈఎల్‌ వరకు వెళ్లే ట్రాఫిక్‌ను సాయిరామ్‌ టవర్స్‌ వద్ద యూటర్న్‌ చేసి హఫీజ్‌పేట ఫ్లైవోర్‌ కింద నుంచి పైప్‌లైన్‌ రోడ్‌ ద్వారా బీహెచ్‌ఈఎల్‌కు దారి మళ్లించనున్నారు. బీహెచ్‌ఈఎల్‌ నుంచి జాతీయ రహదారి మీదుగా పటాన్‌చెరు వెళ్లే వాహనదారులను బీహెచ్‌ఈఎల్‌ జంక్షన్‌ వద్ద బ్లాక్‌ చేసి వన్‌వేలో పంపిస్తామని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి: భారత్ జోడో యాత్రలో రోహిత్ వేముల తల్లి

ఇవి కూడా చదవండి: