Published On:

Minister Uttam Kumar Reddy: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. బిల్డర్ల సమస్యల పరిష్కారానికి కృషి!

Minister Uttam Kumar Reddy: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. బిల్డర్ల సమస్యల పరిష్కారానికి కృషి!

Minister Uttam Kumar Reddy Comments Cyberabad Builders Association AGM 2025: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నిర్మాణ రంగం డెవలప్‌మెంట్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరంలో ఆదివారం సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు బిల్డర్ల సమస్యలపై మాట్లాడారు.

 

రాష్ట్రంలో నెలకొన్న బిల్డర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. అలాగే హైదరాబాద్ నగర డెవలప్‌మెంట్ కోసం బిల్డర్లు కూడా తోడ్పాటు అందించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకు కల్పించిందన్నారు. అంతకుముందు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఓఆర్ఆర్, కృష్ణా, గోదావరి జలాల తరలింపు వంటివి కాంగ్రెస్ హయాంలోనే జరిగాయన్నారు.

 

భవిష్యత్తులో హైదరాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చేయాలన్నారు. మెట్రోను కూడా మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. హైదరాబాద్ మహా నగరాన్ని మరో సిలికాన్ వ్యాలీగా తీర్చిదిద్దుతామన్నారు. పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. ఇందులో భాగంగానే సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్‌కు సపోర్టు ఇవ్వనున్నట్లు భరోసా కల్పించారు. అందరికీ మరింత లాభాలు వచ్చేలా హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వంలో బిల్డర్స్ భాగస్వాములేనని ఉంటారన్నారు.