Published On:

Klin Kaara Konidela: ఇద్దరు నాన్నలు ఉన్నారేంటి.. క్లిన్ కార క్యూట్ వీడియో వైరల్!

Klin Kaara Konidela: ఇద్దరు నాన్నలు ఉన్నారేంటి.. క్లిన్ కార క్యూట్ వీడియో వైరల్!

Klin Kaara Konidela Video: మెగా వారసురాలు పుట్టాక.. మెగా ఫ్యామిలీలో అన్ని శుభాలే జరుగుతున్నాయి. దాదాపు పదేళ్ల తర్వాత రామ్ చరణ్ , ఉపాసనకు.. క్లిన్ కార జన్మించింది. వారసురాలు పుట్టిన వేళా విశేషం.. మెగా ఫ్యామిలీలో చూడలేము అనుకున్న అద్భుతాలు అన్ని జరిగాయి. ఇక అవన్నీ పక్కన పెడితే.. చరణ్ పూర్తిగా తండ్రి బాధ్యతలు తీసేసుకున్నాడు. క్లీన్ కారకు అన్నం తినిపించడం దగ్గర నుంచి అన్ని పనులు తనే స్వయంగా చేస్తున్నాడు. కూతురును చూడకుండా క్షణం కూడా ఉండడం లేదు. చివరికి సినిమా షూటింగ్స్ కూడా ఇంటికి దగ్గరగానే పెట్టాలని నిర్మాతలను కోరుతున్నాడు.

 

క్లీన్ కార పుట్టి ఏడాది దాటింది. ఇప్పటివరకు చిన్నారి ముఖాన్ని మెగా ఫ్యామిలీ రివిల్ చేయలేదు. దాని గురించి చరణ్ ఒక వివరణ కూడా ఇచ్చాడు. తననెప్పుడు క్లిన్ కార నాన్న అని పిలుస్తుందో అప్పుడు అందరికీ చూపిస్తాను అని తెలిపాడు. ఆ క్షణం కోసం చరణ్ తో పాటు మెగా ఫ్యాన్స్ అందరూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మధ్యనే చరణ్ మైనపు విగ్రహాన్ని లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ లో ఆవిష్కరించిన విషయం తెల్సిందే.

 

చరణ్ పెట్ డాగ్ రైమ్ తో కలిసి ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎలిజిబెత్ మహారాణి తరువాత.. పెట్ డాగ్ తో విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత చరణ్ కు దక్కింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యింది. ఇక ఈ వేడుకలో ఒక క్యూట్ సంఘటన చోటుచేసుకుంది. తన మైనపు విగ్రహంతో కలిసి చరణ్ ఫోటోలకు ఫోజులు ఇస్తుంటే.. కింద ఉన్న క్లిన్ కార స్టేజ్ ఎక్కి తండ్రి వద్దకు వచ్చింది.

 

వెనుక నుంచి తల్లి ఉపాసన కార.. కార అని పిలుస్తునా పట్టించుకోకుండా తండ్రి వద్దకు వెళ్ళింది. అక్కడ ఇద్దరు నాన్నలను చూసి షాక్ అయ్యి.. ఎవరు ఒరిజినల్ అనేది తెలియకుండా విగ్రహాన్ని పట్టుకోవడానికి ముందుకు వెళ్ళింది. చరణ్ తనను ఆపడంతో ఆ విగ్రహం వైపు అలానే చూస్తూ ఉండిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హా ఎంత క్యూట్ గా ఉంది వీడియో అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.