Ram Charan: కడపకు వెళ్లనున్న రామ్ చరణ్ – ఎందుకో తెలుసా?
Ram Charan Visit Kadapa Dargah: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవ టీం ప్రమోషన్స్ జోరు పెంచింది. ఇటీవల లక్నోలో టీజర్ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించి విడుదల చేశారు. ఈ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ని కూడా జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ త్వరలో కడప వెళ్లనున్నాడట. ఈ నెల 18న చరణ్ కడపలో దర్గాను దర్శించుకోనున్నాడని తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కడప దర్గాలో ఈ నెల 18న జాతీయ ముషాయిరా గజల్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ గజల్ గాయకులు పాల్గొననున్నారు. అయితే ఈ వేడుకకు రామ్ చరణ్‌కు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఆయన ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ క్రమంలో ఆయన అక్కడి దర్గాను సందర్శించి ప్రత్యక ప్రారనలు చేయనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇక రామ్ చరణ్ కడపకు వస్తున్న నేపథ్యంలో ఆయనను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు అక్కడ భారీగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ అయ్యప్ప మాల దీక్షలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఈ దర్గా వేడుకలకు హజరయ్యే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కాగా ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో చరణ్ డ్యుమెల్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ పాత్ర ఎన్నికల అధికారిగా కనిపించనుంది. ఇందులో కియార అద్వానీ హీరోయిన్ కాగా.. నటి అంజలి మరో ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. ఇందులో శ్రీకాంత్, సునీల్, కన్నడ నటుడు జయరాం, నవీన్ చంద్ర, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, ఎస్జే సూర్య, సముద్రఖని వంటి తదితర నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథను అందించగా.. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు.