Eggs from Snake Mouth: ఇదెక్కడి వింతరా బాబోయ్.. నోట్లో నుంచి గుడ్లు పెడుతున్న పాము!

Snake Laying an Egg from its Mouth: సాధారణంగా విషపూరితమైన పాములు ఉంటాయని అందరికీ తెలిసిందే. భయంకరమైన పాములు ప్రపంచంలో చాలా ఉన్నాయి. కొన్ని పాములు జనావాసాల్లో సంచరిస్తూ ఉంటాయి. ఇటీవల చాలాచోట్ల తిరుగుతున్న పాములను పట్టుకునే క్రమంలో కొంతమంది స్నేక్ క్యాచర్స్ కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో వీడియో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా చాలా భయంకరమైన పాముకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
మనం చాలా రకాల పాములను సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. కానీ, వైరల్ అవుతున్న వీడియో చాలా ప్రత్యేకమైనవి. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ పెద్ద పామును మీరు చూడొచ్చు. అయితే, చాలా భయంకరమైన పాము తన నోట్లో నుంచి గుడ్లను బయటికి తీయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దాదాపు మూడు నుంచి నాలుగు గుడ్లను బయిటికి తీసింది. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
సాధారణంగా కొన్ని పాములు గుడ్లు పెట్టి పిల్లలకు జన్మనివ్వడం చూశాం. పాములు గుడ్లు పెట్టడానికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ వీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురుయ్యారు. కొంతమంది నెటిజన్లు పాములు ఇలా గుడ్లు పెట్టి పిల్లలను కంటాయా? అని కామెంట్స్ చేశారు. పాము గుడ్లను తన నోట్లో నుంచి బయటికి తీయడంతో చూసినవారు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. అయితే, చాలామంది వీడియోను చూసి స్పందిస్తున్నారు. దీనిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటి వరకు వీడియోను కొన్ని లక్షల మందికి పైగా వీక్షించారు.