Cobra Bathing in Bucket: హాట్ హాట్ సమ్మర్ లో కూల్ వాటర్ బకెట్ లో కోబ్రా స్నానం.. ఎలా ఎంజాయ్ చేస్తుందో మీరే చూడండి!

Cobra Enjoys bathing in a Cool Water: కింగ్ కోబ్రా పాముల్లో చాలా రకాలు ఉంటాయి. కొన్ని రకాల పాములు చాలా ప్రమాదకరం. గిరి నాగుపాము మరీ డేంజర్. నాగుపాముల్లో ఇండియన్ కింగ్ కోబ్రాలు నిదానత్వం కలిగి ఉంటాయి. కానీ, రెండు పాములు కాటేస్తే మృతిచెందటం ఖాయం. రెండు పాములు ఎలాపిడే జాతికి చెందినవి. ఈ జాతి నుంచి పుట్టిన పాముల్లో గిరి నాగుపాము మొదటి రకం. ఇవి చాలా అరుదుగా కనిపిస్తుంటాయి.
ఈ గిరినాగు పాముల శరీరం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ పాముల శరీరం ప్రత్యేకమైన పొలుసును కలిగి ఉంటుంది. ఇందులో ఆడ జాతికి చెందిన పాములు గుడ్లు పెట్టి పిల్లలకు జన్మనిస్తాయి. ఈ పాములు ఆడవులతో కూడిన నదీ తీర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పటికీ అమెజాన్ ఆడవుల్లో వేలకొద్ది నివసిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి పాములు ఇండ్లలోకి వచ్చిన క్రమంలో తీసిన అనేక వీడియో వైరల్ అవుతున్నాయి.
గిరినాగుకు చెందిన పాముల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు అయితే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తాజాగా ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. వీడియోలో గిరినాగుకు సంబంధించిన అరుదైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. వీడియోకి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. భారీ గిరినాగు ఓ బకెట్లో మునిగి అటు ఇటూ కదులుతోంది.
బకెట్‌లో గిరినాగు ఉందని స్థానికులు గమనించి స్నేక్ క్యాచర్స్ సమాచారం సమాచారం ఇచ్చారు. వెంటనే వారు అక్కడి చేరుకుని పామును పట్టుకునేందుకు ప్రత్నించారు. స్నేక్ క్యాచర్ పామును పట్టుకుని సురక్షితమైన ప్రదేశానికి తరిలించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ పాము వేసవి ఉష్ణోగ్రతను తట్టుకోలేక చల్లదనం కోసం నీరు ఉన్న బకెట్‌లోకి దిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ దృశ్యాలను ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.