Last Updated:

Pawan Kalyan Unstoppable 2: పొలిటికల్ హీట్.. పవన్ అన్ స్టాపబుల్ పార్ట్ 2 ఎపిసోడ్ ప్రోమో

Pawan Kalyan Unstoppable 2: పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ పార్ట్ 2 ఎపిసోడ్ ప్రోమోను ఆహా విడుదల చేసింది. పార్ట్ 1 ఇదివరకే స్ట్రీమింగ్ అయింది. తాజాగా పార్ట్ 2 కి సంబంధించి ప్రోమోను రిలీజ్ చేశారు. ఇక ఈ ప్రోమోలో పొలిటికల్ హీట్ ఎక్కువగా కనిపించింది. బాలకృష్ణ- పవన్ మధ్య రాజకీయ సంభాషణ జరిగినట్లు తెలుస్తుంది.

Pawan Kalyan Unstoppable 2: పొలిటికల్ హీట్.. పవన్ అన్ స్టాపబుల్ పార్ట్ 2 ఎపిసోడ్ ప్రోమో

Pawan Kalyan Unstoppable 2: పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ పార్ట్ 2 ఎపిసోడ్ ప్రోమోను ఆహా విడుదల చేసింది. పార్ట్ 1 ఇదివరకే స్ట్రీమింగ్ అయింది. తాజాగా పార్ట్ 2 కి సంబంధించి ప్రోమోను రిలీజ్ చేశారు. ఇక ఈ ప్రోమోలో పొలిటికల్ హీట్ ఎక్కువగా కనిపించింది. బాలకృష్ణ- పవన్ మధ్య రాజకీయ సంభాషణ జరిగినట్లు తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వచ్చిన అన్ స్టాపబుల్ షో కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పార్ట్ 1 రికార్డు సృష్టించింది. పార్ట్ 2 కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన ప్రోమోను ఆహా టీమ్ విడుదల చేసింది. ఇందులో పవన్ కళ్యాణ్ రాజకీయం గురించి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.

పొలిటికల్ హీట్..

జనసేన పార్టీ ఆవిర్భావం.. 2019 ఎన్నికలపై బాలకృష్ణ ప్రశ్నలు వేశారు.

అలాగే వైసీపీ ప్రభుత్వంపై పోరాటం గురించి కూడా బాలయ్య పలు ప్రశ్నలు అడిగాడు.

ప్రస్తుతం ఈ ప్రశ్నలు పొలిటికల్ హీట్ ను పెంచాయి.

తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసే విషయంపై సైతం ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ఈ ప్రోమోలో ముఖ్యంగా ఇప్పటం సంఘటనలో కారుపై కూర్చుని వెళ్లిన ఫోటోపై ప్రశ్నలు సంధించారు బాలయ్య.

ఈ ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అదిరిపోయే సమాధానం ఇచ్చారు. ఇక పవన్ కి తోడుగా డైరెక్టర్ క్రిష్ కూడా ఈ ప్రోమోలో కనిపించారు.

ఫిబ్రవరి 10 పార్ట్ 2 స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా తెలిపింది. దీని కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఈ ఎపిసోడ్ మరింత హైప్ క్రియేట్ చేసేలా ఉందటూ పవన్ అభిమానులు అంటున్నారు.

కొంతకాలంగా పవన్ తొలి ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూశారు.
మెుదటి పార్ట్ పూర్తవడంతో.. రెండవ పార్ట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఇక దీనికి సంబంధించి ప్రోమో రిలీజ్ అయింది.

ఇందులో ఓ ముసలావిడ పవన్ కళ్యాణ్ ను మెచ్చుకున్నారు.

ప్రోమో 2 రిలీజ్ తో సోషల్ మీడియాలో హంగామా తారా స్థాయికి చేరింది.

పవన్ కళ్యాణ్ గురించి బాలయ్య సంచలన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.

అన్‌స్టాపబుల్ షోతో బుల్లితెర ప్రేక్షకులకు బాలయ్య బాగా దగ్గరయ్యారు.

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదికగా ప్రసారమవుతోన్న ఈ షోపై ప్రేక్షకులకు విపరీతంగా స్పందిస్తున్నారు.

ఎపిసోడ్‌ మొదటి భాగం సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

ఈ ఎపిసోడ్ 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ దాటినట్లు ఆహా తెలిపింది.

ఈ సందర్భంగా పవన్ అభిమానులకు, ఆహా సబ్‌స్క్రైబర్లకు ధన్యవాదాలు తెలిపింది.

ఎపిసోడ్‌లో బాలయ్య తనదైన హోస్టింగ్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

పవన్ కూడా అదిరిపోయే రేంజ్ లో అలరించారు.

మరో అతిథిగా దర్శకుడు క్రిష్

అన్ స్టాపబుల్ సీజన్ 2 కి ఇదే చివరి ఎపిసోడ్ కావడంతో.. భారీ రేంజ్ లో దీనిని ప్లాన్ చేశారు.

ఈ షో లో భాగంగా బాలకృష్ణ – పవన్ ల మధ్య జరిగిన ముచ్చట్లు అందరికీ తెగ నచ్చేస్తున్నాయి.

పవన్ తన వ్యక్తిగత జీవితంతో పాటు.. సినిమా విశేషాలను కూడా పంచుకున్నారు.

పవన్ చిన్ననాటి జీవితం.. సినిమా రంగంలోకి వచ్చిన మార్పులను అభిమానులకు తెలియజేశాడు.

తనలో జరిగిన మానసిక సంఘర్షణను పవన్ ఆవిష్కరించిన తీరు అద్భుతంగా ఉంది.

ఒకానొక సమయంలో.. తను గన్ పట్టుకున్న సమయాన్ని కూడా పవన్ అభిమానులకు తెలిపారు.

రామ్ చరణ్.. సాయి ధరమ్ తేజ్ లకు పవన్ ఎలా సన్నిహితంగా మారారో ఇందులో చక్కగా వివరించారు.

రాజకీయాలు.. సమాజానికి చేయాల్సిన సేవను పవన్ ఈ షో లో తెలిపారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/