Last Updated:

Waltair Veerayya Pre Release Event: వాల్తేరు వీరయ్యకు జగన్ షాక్.. వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ పర్మిషన్ రద్దు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా "వాల్లేరు వీరయ్య". ఈ చిత్రంలో చిరు సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదలవుతున్న విషయం తెలిసిందే. జనవరి 13 వ తేదీన ఈ సినిమా పరరెక్షకుల ముందుకు రానుంది.

Waltair Veerayya Pre Release Event: వాల్తేరు వీరయ్యకు జగన్ షాక్.. వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ పర్మిషన్ రద్దు

Waltair Veerayya Pre Release Event: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా “వాల్లేరు వీరయ్య”. ఈ చిత్రంలో చిరు సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదలవుతున్న విషయం తెలిసిందే. జనవరి 13 వ తేదీన ఈ సినిమా పరరెక్షకుల ముందుకు రానుంది. అలాగే ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తుండటంతో మరింత ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా కోసం చిరంజీవి, రవితేజ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో మూవీ ప్రమోషన్‌ జోరుగా సాగుతోంది.

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ తాజాగా సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. పాటలు, ఎంటర్ టైన్ మెంట్, యాక్షన్ సీక్వెన్స్, ఎమోషన్స్ అద్భుతంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రచార కార్యక్రమాలలో వేగం పెంచింది చిత్రయూనిట్. ఈ మేరకు కొన్ని గంటల క్రితమే ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో మెగాస్టార్ మార్క్ యాక్షన్, పవర్ఫుల్ డైలాగ్స్, కామెడీ, మాస్ స్టెప్పులుతో ఫుల్ మీల్స్ అందించారు. ఈ సినిమాలో ఊరమాస్ అవతారంలో మెగాస్టార్ పాత్ర ఉండబోతుందని ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. ముఖ్యంగా ‘‘మాస్ అనే పదానికి బొడ్డుకోసి పేరెట్టిందే ఆయన్ను చూసి.. వాడు నా ఎర, నువ్వే నా సొర.. రికార్డులో నా పేరు ఉండటం కాదు, నా పేరు మీదే రికార్డులు ఉంటాయి అనే డైలాగులు ట్రైలర్ కి హైలైట్ గా నిలిచాయి. ముఖ్యంగా వింటేజ్ చిరుని గుర్తుచేసేలా ఆ స్వాగ్, ఆ స్టైల్ ఉన్నాయని అందరూ అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ దుమ్ము లేపుతుంది.

కాగా మరోవైపు 8 వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ముందుగా విశాఖ బీచ్‌ రోడ్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 8న సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఏపీలో జీవో 1 కారణంగా బీచ్‌ రోడ్‌ నుంచి వేదికను మార్చుకోవాలని పోలీసులు సూచించారు. దీంతో సభ వేదికను ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ గ్రౌండ్స్‌కి షిఫ్ట్‌ చేశారని వార్తలు వినిపసితున్నాయి. కాగా ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభుత్వం ఏయూ లో ఈవెంట్ నిర్వహించడానికి అనుమతి నిరకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మెగా అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈవెంట్ కి 24 గంటలు కూడా లేని తరుణంలో ప్రభుత్వం ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ చేస్తారో అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

Sania Mirza: టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా రిటైర్మెంట్.. అదే చివరి టోర్నీ అంటూ క్లారిటీ

Waltair Veerayya Trailer : మాస్ కి బొడ్డు కోసి పేరు పెట్టిందే ఆయన… మెగాస్టార్ చిరంజీవి “వాల్తేరు వీరయ్య” ట్రైలర్ రిలీజ్

Veera Simha Reddy: బాలకృష్ణ వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్ ఫొటోలు

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

 

ఇవి కూడా చదవండి: