Last Updated:

Samsung Galaxy S25 Edge: ఎంత స్లిమ్‌గా ఉందో.. 200MP కెమెరాతో గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్‌ ఫోన్.. కొత్తగా ఏముందో తెలుసా..?

Samsung Galaxy S25 Edge: ఎంత స్లిమ్‌గా ఉందో.. 200MP కెమెరాతో గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్‌ ఫోన్.. కొత్తగా ఏముందో తెలుసా..?

Samsung Galaxy S25 Edge: సామ్‌సంగ్ త్వరలో తన కొత్త, చాలా ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్ ‘Galaxy S25 Edge’ని విడుదల చేయబోతోంది. అయితే దీనికి సంబంధించిన సమాచారం ఇప్పటికే లీక్ అయింది. గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ ఇప్పటివరకు అత్యంత సన్నని, అత్యంత శక్తివంతమైన గెలాక్సీ ఫోన్ అవుతుందా? ఇది ఐఫోన్ 17 ఎయిర్‌తో పోటీ పడుతుందా? సామాచారం ప్రకారంజజ ఈ ఫోన్ ఏప్రిల్ 16 న విడుదల కానుంది. అయితే ఫోన్ ఫీచర్లు, ధర గురించి చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 200MP కెమెరా, 120Hz OLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఇందులో ప్రత్యేకంగా కనిపిస్తాయి.

Samsung Galaxy S25 Edge Price
తాజాగా సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్‌కు సంబంధించి పెద్ద వార్త వచ్చింది. ఈ ఫోన్‌ను ఏప్రిల్ 16న ఆన్‌లైన్ ఈవెంట్ ద్వారా లాంచ్ చేయచ్చు. దక్షిణ కొరియా నివేదికల ప్రకారం.. ఈ ఫోన్ మే అమ్మకానికి వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లైట్ బ్లూ, బ్లాక్, సిల్వర్ కలర్ వేరియంట్స్‌లో వస్తుంది. గెలాక్సీ S25 ఎడ్జ్ అత్యంత సన్నని గెలాక్సీ ఫోన్ అవుతుంది. దీని మందం 6.4మిమీ మాత్రమే ఉంటుంది. ఇది గెలాక్సీ S25 (7.2mm) కంటే సన్నగా ఉంటుంది. ఈ ఫోన్ గెలాక్సీ S25 కంటే ఖరీదైనది కానీ గెలాక్సీ S25 అల్ట్రా కంటే చౌకగా ఉంటుంది. గెలాక్సీ S25 ప్రారంభ ధర $799 (సుమారు రూ. 66,500), S25 అల్ట్రా ప్రారంభ ధర $1,299 (సుమారు రూ. 1,08,000).

Samsung Galaxy S25 Edge Features And Specifications
గెలాక్సీ S25 ఎడ్జ్‌లో శక్తివంతమైన కెమెరా సెటప్‌ ఉంటుంది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. ఫోన్ వెనుక ప్యానెల్‌లో రెండు కెమెరా సెన్సార్లు ఉంటాయి, ఇందులో 200MP మెయిన్ కెమెరా, 50MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. ఇవి కాకుండా ఫోన్‌లో 6.7-అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 12GB ర్యామ్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఇప్పటికే Geekbench లిస్టింగ్‌లో గుర్తించారు. ఫోన్ బరువు 165 గ్రాముల బరువున్న గెలాక్సీ S25 కంటే తక్కువగా ఉంటుంది. 3C సర్టిఫికేషన్ ప్రకారం గెలాక్సీ ఎస్‌ 25 ఎడ్జ్ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Samsung Galaxy S25 Edge Launch Date
గెలాక్సీ S25 ఎడ్జ్ ప్రొడక్షన్ యూనిట్ 40,000. ఈ ఫోన్ ఏ దేశాల్లో లాంచ్ అవుతుందో ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఫోన్ అమ్మకాలు బాగుంటే సామ్‌సంగ్ దాని లభ్యతను మరింత పెంచవచ్చు. ఈ ఫోన్ ఐఫోన్ 17 ఎయిర్‌కు ముందు మార్కెట్‌లోకి వస్తుంది, ఇది ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. అయితే గెలాక్సీ S25 ఎడ్జ్ భారతదేశంలో విడుదల అవుతుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ ఫోన్‌కి సంబంధించిన మరింత సమాచారాన్ని త్వరలో వస్తుంది.