PBKS vs DC: రూస్సోవ్ విధ్వంసం.. పంజాబ్ లక్ష్యం 214 పరుగులు
PBKS vs DC: పంజాబ్‌కు ఇవాళ్టి మ్యాచ్ చాలా కీలకం. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారీ రన్‌రేట్‌తో గెలవాలి. అదే సమయంలో ఇతర జట్ల ఫలితాల కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది.
PBKS vs DC: దిల్లీ భారీ స్కోర్ సాధించింది. మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ రూస్సోవ్ విధ్వంసం సృష్టించాడు. 37 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. అంతకుముందు.. దిల్లీ ఓపెనర్లు రాణించారు. వార్నర్ 46 పరుగులు చేయగా.. పృథ్వి షా 54 పరుగులు చేశాడు. చివర్లో సాల్ట్ రెండు సిక్సులు, రెండు ఫోర్లతో చెలరేగాడు. దీంతో 20 ఓవర్లలో దిల్లీ 213 పరుగులు చేసింది.
పంజాబ్ బౌలర్లలో సామ్ కరణ్ ఒక్కడే రెండు వికెట్లు తీసుకున్నాడు.
LIVE NEWS & UPDATES
-
PBKS vs DC: రూస్సోవ్ విధ్వంసం.. పంజాబ్ లక్ష్యం 214 పరుగులు
దిల్లీ భారీ స్కోర్ సాధించింది. మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ రూస్సోవ్ విధ్వంసం సృష్టించాడు. 37 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. అంతకుముందు.. దిల్లీ ఓపెనర్లు రాణించారు. వార్నర్ 46 పరుగులు చేయగా.. పృథ్వి షా 54 పరుగులు చేశాడు. చివర్లో సాల్ట్ రెండు సిక్సులు, రెండు ఫోర్లతో చెలరేగాడు. దీంతో 20 ఓవర్లలో దిల్లీ 213 పరుగులు చేసింది.
పంజాబ్ బౌలర్లలో సామ్ కరణ్ ఒక్కడే రెండు వికెట్లు తీసుకున్నాడు.
-
PBKS vs DC: రెండో వికెట్ కోల్పోయిన దిల్లీ, షా ఔట్
దిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. జోరు మీదున్న షా క్యాచ్ ఔటయ్యాడు.
-
PBKS vs DC: పృథ్వి షా అర్దసెంచరీ.. 36 బంతుల్లో 50 పరుగులు
చాలా కాలం తర్వాత పృథ్వి షా ఫామ్ లోకి వచ్చాడు. 36 బంతుల్లో 50 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు.
-
PBKS vs DC: రూస్సోవ్ విధ్వంసం.. 3 సిక్సులు, 2 ఫోర్లు
వన్ డౌన్ లో వచ్చిన రూస్సోవ్ విధ్వంసం సృష్టిస్తున్నాడు. సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడుతున్నాడు.
-
PBKS vs DC: తొలి వికెట్ కోల్పోయిన దిల్లీ.. వార్నర్ ఔట్
దిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. కరణ్ బౌలింగ్ లో వార్నర్ క్యాచ్ ఔటయ్యాడు. శిఖర్ ధావన అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.
-
PBKS vs DC: 10 ఓవర్లకు 93.. ధాటిగా దిల్లీ బ్యాటింగ్
దిల్లీ బ్యాటర్లు ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నారు. 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా దిల్లీ 93 పరుగులు చేసింది.
-
PBKS vs DC: పవర్ ప్లే లో భారీగా పరుగులు
దిల్లీ పవర్ ప్లే భారీగా పరుగులు చేసింది. వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది.
-
PBKS vs DC: ధాటిగా బ్యాటింగ్.. ఐదు ఓవర్లకు అర్ధసెంచరీ
దిల్లీ ఓపెనర్లు ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఐదు ఓవర్లలో 50 పరుగులు చేశారు.
-
PBKS vs DC: నాలుగో ఓవర్లు రెండు సిక్సులు
రబాడా వేసిన ఓవర్లో వార్నర్ రెండు సిక్సులు బాదాడు.
-
PBKS vs DC: రెండు బంతుల్లో రెండు ఫోర్లు
మూడో ఓవర్ చివరి రెండు బంతులను వార్నర్ ఫోర్లుగా మలిచాడు.
-
PBKS vs DC: తొలి ఓవర్.. కేవలం నాలుగు పరుగులే
తొలి ఓవర్లో కేవలం నాలుగు పరుగులే వచ్చాయి. సామ్ కరణ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో వార్నర్, షా ఉన్నారు.
-
PBKS vs DC: పంజాబ్ తుది జట్టు ఇదే
శిఖర్ ధావన్(కెప్టెన్), అథర్వ టైడే, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), సామ్ కర్రాన్, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, నాథన్ ఎల్లిస్, అర్ష్‌దీప్ సింగ్
-
PBKS vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), రిలీ రొసో, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, యష్ ధుల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్టే, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్