IPL 2025: రుతురాజ్ గైక్వాడ్ ఔట్.. చెన్నై కెప్టెన్‌గా మళ్లీ ధోనీనే..!

MS Dhoni back as CSK captain in IPL 2025: ఐపీఎల్ ఫ్రాంఛైజీ కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మహేంద్ర సింగ్ ధోనీని మరోసారి కెప్టెన్‌గా ప్రకటించింది. ప్రస్తుతం కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ మోచేతి గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ తరుణంలో ఈ సీజన్‌లో మిగతా మ్యాచ్‌లకు ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఇందులో భాగంగానే చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ ఫ్లెమింగ్ అధికారికంగా ప్రకటించాడు.
ఇదిలా ఉండగా, ఐపీఎల్ 2025లో భాగంగా ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి చెందగా.. ఒక్క మ్యాచ్ మాత్రమే విజయం సాధించింది. చెన్నై తర్వాతి మ్యాచ్ ఏప్రిల్ 11న చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. అంతకుముందు ధోనీ సారథ్యంలో చెన్నై 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. చివరిగా 2023లో చెన్నై కెప్టెన్‌గా ధోనీ వ్యవహరించగా.. టైటిల్ గెలుచుకుంది. తాజాగా, తలైవా మళ్లీ కెప్టెన్‌గా రావడంతో చెన్నై భవితవ్యం మారుతుందని సీఎస్‌కే ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు, కెప్టెన్‌గా వ్యవహరించిన రుతురాజ్ గైక్వాడ్.. మొత్తం 5 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 26 బంతుల్ల 53 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ చెన్నై గెలిచింది. అలాగే రాజస్థాన్ రాయల్స్ జట్టుపై 44 బంతుల్లో 63 పరుగులు చేయగా.. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. దీంతో ఈ సీజన్‌లో 150.62 స్ట్రైక్ రేట్‌తో 122 పరుగులు చేశాడు.