IPL 2025 33rd Match: నేడు రసవత్తర మ్యాచ్.. ముంబై ఇండియన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీ

Mumbai Indians vs Sunrisers Hyderabad IPL 2025 33rd Match: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. ముంబై వేదికగా ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. వాంఖడే స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు ఇరు జట్లు 23 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో ముంబై ఇండియన్స్ 13 మ్యాచ్‌లు గెలవగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 మాత్రమే గెలిచింది. ఈ సీజన్‌లో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 9వ స్థానంలో కొనసాగుతుండగా.. ముంబై ఇండియన్స్ 7వ స్థానంలో ఉంది.
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 మ్యాచ్‌లు ఆడగా.. 2 మ్యాచ్‌ల్లో గెలుపొంది నాలుగు మ్యాచ్‌ల్లో ఓడింది. ముంబై ఇండియన్స్ 6 మ్యాచ్‌లు ఆడగా.. 2 మ్యాచ్‌ల్లో గెలిచి 4 మ్యాచ్‌ల్లో ఓటమి చెందింది. అయితే ఇరు జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో విజయాన్ని సాధించాయి. దీంతో నేటి మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.