Rohith Vemula Act : రోహిత్ వేముల చట్టాన్ని రూపొందించండి.. కర్ణాటక సీఎంకు రాహుల్ గాంధీ లేఖ

Rohith Vemula Act : విద్యావ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకురావాలని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ తెలిపారు. ఈ సందర్భంగా విద్యావ్యవస్థలో కుల వివక్షను నిర్మూలనకు రోహిత్ వేముల చట్టాన్ని రూపొందించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యను కోరారు. ఈ సందర్భంగా రాహుల్ సీఎంకు లేఖ రాశారు. తన జీవిత కాలంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కుల వివక్ష ఎదుర్కొన్నారని తన లేఖలో పేర్కొన్నారు. అంబేద్కర్ ఎదుర్కొన్న వివక్షను రాహుల్ తన లేఖలో ప్రస్తావించారు. తమ వద్ద ఆహారం ఉన్నా అంటరానివాళ్ల కావడంతో నీళ్లు ఎవరూ ఇవ్వలేదని తెలిపారు. దీంతో తిండి తినలేకపోయినట్లు అంబేద్కర్ స్టోరీని రాహుల్ గుర్తుచేశారు.
వివక్ష ఎదుర్కొడం సిగ్గుచేటు..
తన అభ్యర్థనను కర్ణాటక ముఖ్యంత్రి అంగీకరిస్తారని తెలిపారు. దేశంలో మరో విద్యార్థి అలాంటి బాధకు గురికావొద్దని రాహుల్ తన లేఖలో పేర్కొన్నారు. దళిత, ఆదివాసీ, ఓబీసీ వర్గాలకు చెందిన లక్షలాది మంది విద్యా వ్యవస్థలో ఇప్పటికీ వివక్ష ఎదుర్కొడం సిగ్గుచేటని తెలిపారు. రోహిత్ వేముల, పాయల్ తద్వి, దర్శన సోలాంకి లాంటి వారు హత్యకు గురయ్యారని తెలిపారు. దీన్ని ఆమోదించలేమని, దీనికి ముగింపు పలకాలన్నారు. బీఆర్ అంబేద్కర్ లాంటి పరిస్థితిని ఎవరూ ఎదుర్కోకుండా ఉండేందుకు రోహిత్ చట్టాన్ని రూపొందించాలని కర్ణాటక సర్కారును కోరుతున్నట్లు రాహుల్ తెలిపారు. ఈ నెల 16న లేఖ రాశారు. హెచ్‌సీయూలో చదువుతున్న రోహిత్ 2016లో కుల వివక్ష తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.