PKBS won the IPL 2025 31st Match: చాహల్ మాయా.. కోల్‌కతాపై పంజాబ్ కింగ్స్ స్టన్నింగ్ విక్టరీ!

Punjab Kings won by 16 Runs against Kolkata Knight Riders in IPL 2025: ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ మరో మ్యాచ్ గెలిచింది. 18వ ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై పంజాబ్స్ కింగ్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ కింగ్స్.. 15,3 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య(22), ప్రభ్ సిమ్రన్ సింగ్(30) పరుగులు చేశారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్(0) డకౌట్ అయ్యాడు. ఇంగ్లిస్(2), నేహాల్ వధేరా(10), మ్యాక్స్ వెల్(7), సూర్యాంశ్(4), శశాంక్(18), యాన్సెన్(1), బార్ట్ లెట్(11) పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రాణా 3 వికెట్లు పడగొట్టి పెద్ద దెబ్బ తీశాడు. అలాగే వరుణ్ చక్రవర్తి, నరైన్ చెరో 2 వికెట్లు, అరోరా, నోకియా చెరో వికెట్ తీశారు.
112 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో కోల్‌కతా బోల్తాపడింది. ఓపెనర్లు నరైన్(5), డికాక్(2) నిరాశ పరిచారు. తర్వాత క్రీజులోకి వచ్చిన రఘువంశీ(37 రహానే(17) నిలకడగా ఆడేందుకు ప్రయత్నించారు. అయితే చాహల్ స్పిన్ మాయాజాలంతో కోల్‌కతా బ్యాటర్లను దెబ్బతీశాడు. వరుసగా రహానె, రఘువంశీలను ఔట్ చేశాడు. రింకూ సింగ్(2), రమణ్ దీప్(0), రస్సెల్(17), వెంకటేశ్ అయ్యర్(7), హర్షిత్ రాణా(3), అరోరా(0) పరుగులు చేశారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో చాహల్ 4 వికెట్లు తీసి కోల్‌కతాకు కోలుకోలేని దెబ్బ తీశాడు. అలాగే యాన్సెన్ 3 వికెట్లు, బార్ట్ లెట్, అర్ష్ దీప్, మ్యాక్స్ వెల్ తలో వికెట్ తీశారు.
ఇదిలా ఉండగా పంజాబ్ కింగ్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ఓఓటమికి ఆ జట్టు కెప్టెన్ రహానేనే కారణమని అభిమానులు అంటున్నారు. స్టార్ స్పిన్నర్ చాహల్ బౌలింగ్‌లో రహానే ఎల్బీగా ఔట్ అయ్యాడు. అయితే స్వీప్ ఆడేందుకు రహానే ప్రయత్నించగా.. రిప్లేలో బాల్ వికెట్లను తాకలేదు. ఒకవేళ రహానే రివ్యూ కోరింటే నాటౌట్ గా ప్రకటించేవారు. దీంతో మ్యాచ్ రిజల్ట్స్ మవేరేలా ఉండేదని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓటమికి తనదే బాధ్యత అని, కెప్టెన్‌గా మంచిగా ఆడాల్సి ఉంటే బాగుండేదని రహానే తెలిపారు.