Andhra Pradesh: రాజ్ కసిరెడ్డిది క్రిమినల్ మైండ్ సెట్..సిట్ విచారణలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Former MP Vijay Sai Reddy Attends SIT Enquiry in AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసు విషయంపై సిట్ చేపట్టిన విచారణ ముగిసింది. ఈ విచారణ మూడు గంటల పాటు కొనసాగింది. ఈ కేసులో భాగంగా వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సిట్ విచారించింది. ఈ మేరకు లిక్కర్‌కు సంబంధించి రెండు మీటింగులు జరిగాయా? అని సిట్ ప్రశ్నించిందని విజయసాయి రెడ్డి అన్నారు. 2019 చివరిలో మీ ఇంట్లో మీటింగ్ జరిగిందా? అని ప్రశ్నించినట్లు తెలిపారు.
అయితే, రెండు మీటింగులు జరిగింది వాస్తవమేనని విజయసాయిరెడ్డి తెలిపారు. హైదరాబాద్, విజయవాడలోని నా ఇళ్లలోనే రెండు సమావేశాలు జరిగినట్లు వివరించినట్లు తెలిపారు. ఈ రెండు మీటింగుల్లో వాసుదేవరెడ్డి, శ్రీధర్ రెడ్డి, మిథున్ రెడ్డి, సత్యప్రసాద్, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. అయితే కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డ హాజరుకాలేదని చెప్పినట్లు పేర్కొన్నారు. క్విక బ్యాక్స్ విషయం గురించి అడగ్గా.. నాకు తెలియదని చెప్పినట్లు వివరించారు.
అనంతరం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నుంచి ఎవరికి క్విక్ బ్యాక్స్ వెళ్లాయని ప్రశ్నించారు. అరబిందో రూ.100కోట్ల అప్పు ఇప్పించానని వివరించారు. రూ.60కోట్లు అడాన్ కంపెనీకి మరో రూ.40 కోట్లు డికార్ట్ కంపెనీకి ఇప్పించినట్లు తెలిపారు. అడాన్ కంపెనీ రాజ్ కసిరెడ్డిది అని విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ విషయంలో రాజ్ కసిరెడ్డి మాత్రమే అన్నింటికీ సమాధానం చెప్పగలరని వివరించారు.
మూడు కంపెనీలను రాజ్ కసిరెడ్డి లీజుకు తీసుకున్నారా అని ప్రశ్నించారు. అంతేకాకుండా, కొత్త బ్రాండ్‌ల తయారీ విషయంపై అడిగితే కసిరెడ్డికే తెలుసని చెప్పానన్నారు. మిథున్ రెడ్డి గురించి నాకు తెలియదని, ఆయననే అడగాలని చెప్పారు. మొదటి నెలల్లో జరిగిన పరిణామాలే నాకు తెలుసని, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదని చెప్పానన్నారు.
రాజ్ కసిరెడ్డిని పార్టీలో నేతలే పరిచయం చేశారన్నారు. రాజ్ కసిరెడ్డిది క్రిమినల్ మైండ్ సెట్ అని వివరించారు. క్రిమినల్ మైండ్ ఉన్న విషయం తెలియక నేను ప్రోత్సహించానన్నారు. కసిరెడ్డిని ప్రోత్సహించి తప్పు చేసినట్లు ఆవేదన చెందారు. రాజ్ కసిరెడ్డి వెనుక ఎవరున్నారో మీరే చెప్పాలన్నారు. సాధారణమైన కసిరెడ్డికి అంత అధికారం ఎవరిచ్చారు? పార్టీని, ప్రజలను రాజ్ కసిరెడ్డి మోసం చేశారన్నారు.