IPL 2025 33rd Match: తేలిపోయిన హైదరాబాద్ బ్యాటర్లు.. ముంబై టార్గెట్ ఎంతంటే?

Sunrisers Hyderabad low Score Against Mumbai Indians IPL 2025 33rd Match: ఐపీఎల్ 2025లో భాగంగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు మళ్లీ తడబడ్డారు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(40), ట్రావిస్ హెడ్(28) రాణించగా.. ఇషాన్ కిషన్(2), నితీశ్ కుమార్ రెడ్డి(19) విఫలమయ్యారు. హెన్రిచ్ క్లాసెన్(30) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. చివరిలో అంకిత్ వర్మ(18), కమిన్స్(8) వేగంగా ఆడడంతో హైదరాబాద్ 12 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, బుమ్రా, హార్దిక్ తలో వికెట్ తీశారు.