Published On:

IPL 2025 32nd Match: ఢిల్లీ భారీ స్కోరు.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

IPL 2025 32nd Match: ఢిల్లీ భారీ స్కోరు.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

Delhi Capitals High Score Against Rajasthan Royals IPL 2025 32nd Match: ఐపీఎల్ 2025లో ఢిల్లీ వేదికగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్ రెండు వికెట్లు పడగొట్టగా.. వానిందు హసరంగ, మహీశ్ తీక్షణ చెరో వికెట్ తీశారు.

 

ఢిల్లీ బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ పొరెల్(49, 37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. మరో ఓపెనర్ జేక్ ఫ్రేజర్(9) పరుగుల వద్ద ఆర్చర్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కరుణ్ నాయర్(0) రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. నిలకడగా ఆడుతున్న కేఎల్ రాహుల్(38, 32 బంతుల్లో 2 పోర్లు, 2 సిక్స్‌లు)ను ఆర్చర్ ఔట్ చేశాడు.

 

క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్(34, 14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా పరుగులు చేశాడు. హసరంగ వేసిన 16వ ఓవర్‌లో వరుసగా అక్షర్ 3 బంతులకు 4, 4 ,6 బాదాడు. దీంతో ఈ ఓవర్‌లో 19 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత ఓవర్‌లో 6, 4, 4, కొట్టిన అక్షర్.. చివరి బంతికి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఢిల్లీ బ్యాటర్లలో చివరిలో ట్రిస్టన్ స్టబ్స్(34, 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అశుతోష్ శర్మ(15, 11 బంతుల్లో 2 ఫోర్లు) పరుగులు చేయడంతో ఢిల్లీ భారీ స్కోరు చేసింది. చివరి ఓవర్‌లో 19 పరుగులు రావడంతో ఢిల్లీ భారీ స్కోరు చేసింది.