Published On:

IPL 2025 32nd Match: నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాజస్థాన్ రాయల్స్ ఢీ.. భారీ స్కోర్‌కు అవకాశం!

IPL 2025 32nd Match:  నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాజస్థాన్ రాయల్స్ ఢీ.. భారీ స్కోర్‌కు అవకాశం!

Delhi Capitals Vs Rajasthan Royals Today IPL 2025 32nd Match: ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 5 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. ఒక్క మ్యాచ్‌లో ఓటమి చెందింది. దీంతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో ఉంది. అలాగే, రాజస్థాన్ రాయల్స్ 6 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలుపొందగా.. 4 మ్యాచ్‌ల్లో ఓడింది. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది.

 

అయితే ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 29 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో రాజస్థాన్ రాయల్స్ 15 మ్యాచ్‌లు గెలవగా.. ఢిల్లీ క్యాపిటల్స్ 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇరు జట్లలో ఇవాళ ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. ఇక, ఇరు జట్లలో కొంత పేలవ ప్రదర్శన కనబడుతోంది. రాజస్థాన్ రాయల్స్ లో పరాగ్ విఫలం కావడంతో కెప్టెణ్ శాంసన్‌పై మ్యాచ్ భారం పడుతోంది. అలాగే ఢిల్లీలో మెక్ గుర్క్ విఫలం చెందుతున్నాడు. అయితే కరుణ్ నాయర్ రావడంతో ఢిల్లీకి అదనపు బలం చేకూరింది. ఢిల్లీలో భారీ స్కోరు చేసే అవకాశం ఉంది.

 

 

ఇవి కూడా చదవండి: