Published On:

IPL 2025 32nd Match: మిచెల్ మ్యాజిక్.. సూపర్ ఓవర్‌లో రాజస్థాన్‌పై ఢిల్లీ గెలుపు

IPL 2025 32nd Match: మిచెల్ మ్యాజిక్.. సూపర్ ఓవర్‌లో రాజస్థాన్‌పై ఢిల్లీ గెలుపు

Delhi Capitals won the Super Over Against Rajasthan Royals: ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీ వేదికగా జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ టై అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 188 పరుగులు చేసింది. 189 పరుగుల లక్ష్యఛేదనలో రాజస్థాన్ రాయల్స్ కూడా 188 పరుగులు చేయడంతో మ్యాచ్ టై‌గా ముగిసింది. చివరి ఓవర్‌లో రాజస్థాన్ గెలిచేందుకు 9 పరుగులు కావాల్సి ఉండగా.. స్టార్ మ్యాజిక్‌తో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది.

 

ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇదే తొలి సూపర్ ఓవర్. ఈ సూపర్ ఓవర్‌లో తొలుత రాజస్థాన్ 11 పరుగులు చేసింది. ఓపెనర్లుగా హెట్‌మెయర్(5), రియాన్ పరాగ్(4) పరుగులు చేశారు. అయితే రియాన్ పరాగ్ అనూహ్యంగా రనౌట్ కావడంతో క్రీజులోకి జైస్వాల్ రనౌట్ అయ్యాడు. ఎక్స్ ట్రా రూపంలో 2 పరుగులు రావడంతో ఢిల్లీ ముందు 12 పరుగుల లక్ష్యం ఉంచింది. దీంతో ఇంకా రెండు బంతులు ఉండగానే సూపర్ ఓవర్ ముగిసింది. తర్వాత 12 పరుగుల రాజస్థాన్ రాయల్స్ విధించిన 12 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 4 బంతుల్లోనే ఛేదించింది. సందీప్ శర్మ బౌలింగ్‌లో రాహుల్(7), స్టబ్స్(6) పరుగులు చేశారు. 4వ బంతికి స్టబ్స్ సిక్స్ కొట్టి ఢిల్లీని గెలిపించాడు.