IPL 2025 34th Match: నేడు మరో ఆసక్తికర పోరు.. బెంగళూరుతో పంజాబ్ ఢీ

Royal Challengers Bengaluru vs Punjab Kings IPL 2025 34th Match: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్ జరుగుతోంది. ఇందులో భాగంగానే ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు మంచి ఫామ్ కొనసాగిస్తున్నాయి. ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరు మ్యాచ్‌లు ఆడగా.. 4 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. అలాగే పంజాబ్స్ కింగ్స్ కూడా ఆడిన 6 మ్యాచ్‌ల్లో నాలుగింట గెలుపొంది 2 మ్యాచ్‌ల్లో ఓడింది. దీంతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. ఈ తరుణంలో మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది.
ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య 33 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో 16 మ్యాచ్‌ల్లో బెంగళూరు గెలుపొందగా.. 17 మ్యాచ్‌ల్లో పంజాబ్ నెగ్గింది. ఇక, గత 3 మ్యాచ్‌లను పరిశీలిస్తే.. పంజాబ్‌పై బెంగళూరు జట్టు గెలిచింది. అలాగే, పంజాబ్ జట్టుపై బెంగళూరు ఇప్పటివరకు అత్యధిక స్కోరు 241 పరుగులు చేయగా.. బెంగళూరుపై పంజాబ్ అత్యధిక స్కోరు 232 పరుగులు చేసింది.