IPL 2025: నేడు కీలక మ్యాచ్.. లక్నోతో హైదరాబాద్ ఢీ!

Lucknow Super Giants Vs Sunrisers Hyderabad in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ లక్నో సూపర్ జాయింట్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ జట్లు తలపడనున్నాయి. లక్నోలోని అటల్ బీహార్ వాజపేయి స్టేడియంలో రాత్రి 7.30గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో లక్నో గెలిస్తే ప్లే ఆఫ్ అవకాశాలు ఇంకా ఉంటాయి. ఒకవేళ లక్నో ఓడితే ప్లే ఆఫ్ ఆశలు వదులుకోవాల్సిందే. ఇక హైదరాబాద్ విషయానికొస్తే.. ఇప్పటికే టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయ్యింది.