Published On:

IPL 2025: సన్‌రైజర్స్ గెలుపు.. ప్లే ఆఫ్సే నుంచి లక్నో ఔట్!

IPL 2025: సన్‌రైజర్స్ గెలుపు.. ప్లే ఆఫ్సే నుంచి లక్నో ఔట్!

Hyderabad won by 6 wickets against Lucknow in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. లక్నో జట్టుకు కీలక మ్యాచ్ కాగా, హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో ప్లే ఆఫ్స్ నుంచి లక్నో నిష్క్రమించింది.

 

మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 205 పరుగులు చేసింది. ఓపెనర్లు మార్ష్(65), మార్‌క్రమ్(61) మంచి శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 115 పరుగులు జోడించారు. ఆ తర్వాత పూరన్(47) రాణించగా.. పంత్(7), బదోని(3) సమద్(3), శార్దూల్(4) విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో మలింగ్ రెండు వికెట్లు తీయగా.. హర్ష్ దూబె, హర్షల్, నితీశ్ తలో వికెట్ తీశారు.

 

206 పరుగులను సన్‌రైజర్స్ హైదరాబాద్ అలవోకగా ఛేదించింది. అభిషేక్(59) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. కిషన్(35), క్లాసెస్(47), కమింద్(32) పరుగులు చేశారు. చివరిలో అనికేత్(5), నితీష్ కుమార్(5) పరుగులు చేశారు. దీంతో హైదరాబాద్ కేవలం 18.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. లక్నో బౌలర్లలో దిగ్వేశ్ రెండు వికెట్లు పడగొట్టగా.. శార్దూల్, ఒరూర్క్ చెరో వికెట్ తీశారు.