Published On:

CSK Vs RR – IPL 2025: నేడు చెన్నైతో రాజస్థాన్ ఢీ.. గెలిచేదెవరో..?

CSK Vs RR – IPL 2025: నేడు చెన్నైతో రాజస్థాన్ ఢీ.. గెలిచేదెవరో..?

Chennai Super Kings Vs Rajasthan Royals Match in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో చెన్నై 12 మ్యాచ్‌లు ఆడగా.. మూడింట గెలిచి మిగతా 9 మ్యాచ్‌ల్లో ఓడింది. ఇక, రాజస్థాన్ 13 మ్యాచ్‌ల్లో మూడింట గెలవగా… 10 మ్యాచ్‌ల్లో ఓటమి చెందింది. పాయింట్ల పట్టికలో 6 పాయింట్లతో చెన్నై చివరి స్థానంలో ఉండగా.. రాజస్థాన్ 9వ స్థానానికి పరిమితమైంది.

 

ఈ మ్యాచ్‌లో ఆసక్తికరమైన అంశం చోటుచేసుకుంది. ఐపీఎల్ 2025లో చెన్నై తరఫున అతి పెద్ద వయస్కుడైన ధోనీ(43), రాజస్థాన్ తరఫున అతి పిన్న వయస్కుడైన వైభవ్ సూర్యవంశీ(14) తలపడుతున్నారు. దీంతో ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

మరోవైపు, ధోనీ ఇంకో సీజన్ ఆడతాడా లేదా అనే విషయంపై అభిమానుల్లో గందరగోళం నెలకొంది. ఈ విషయంపై ధోనీ కూడ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఎలాంటి స్పష్టత బయటకు రావడం లేదు. ఈ విషయంపై చెన్నై టీం కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను అడిగితే.. ఏమో తెలియదు అని సమాధానం ఇవ్వడంతో మరోసారి సస్పెన్స్ పడింది.