UPSC 2024 Results Out: యూపీఎస్సీ ఐఎఫ్ఎస్ ఫలితాలు విడుదల!

UPSC Indian Forest Service exam 2024 result Out Now: యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు 2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో కనిక అనభ్కు మొదటి ర్యాంకు, ఖండేల్వాల్ ఆనంద్ సెకండ్ ర్యాంకు, అనుభవ్ సింగ్ మూడో ర్యాంకు, జైన్ సిద్ధార్థ్ పరస్మల్ నాలుగో ర్యాంకు, మంజునాథ్ శివప్ప నిడోని ఐదో ర్యాంకు వచ్చింది.
అయితే ఈ ఐఎఫ్ఎస్ ఫలితాల్లో మిర్యాలగూడ వాసి చాడా నిఖిల్రెడ్డికి 11వ ర్యాంకు రాగా, యొడుగూరి ఐశ్వర్యారెడ్డికి 13వ ర్యాంకు వచ్చింది. చేరూరి అవినాస్ రెడ్డి 40. చింతకాయల లవకుమార్ 49, అట్ల తరుణ్ తేజ 53, గోపీనాథ్ 55 వ ర్యాంకు సాధించారు. మొత్తం 150 పోస్టులు ఉండగా.. 143 మంది అభ్యర్థులను సిఫార్సు చేసింది. ఫలితాల కోసం upsc.gov.inలో చెక్ చేసుకోవచ్చు.
కాగా, 2024, నవంబర్ 24 నుంచి డిసెంబర్ 1 వరకు రాత పరీక్ష జరగగా.. 2025 ఏప్రిల్ 21, మే 2 మధ్య పర్సనల్ ఇంటర్వ్యూ ముగిసింది. ఈ మేరకు 143 మందితో కూడిన మెరిట్ లిస్ట్ విడుదల చేసింది. ఇందులో జనరల్ 40, ఈడబ్ల్యూఎస్ 19, ఓబీసీ 50, ఎస్సీ 23. ఎస్టీ 11 మంది అభ్యర్థులు ఉన్నారు.