Published On:

IPL 2025 : బెంగళూరుకు ఐదో విజయం.. మెరిసిన కోహ్లీ, ప‌డిక్క‌ల్

IPL 2025 : బెంగళూరుకు ఐదో విజయం.. మెరిసిన కోహ్లీ, ప‌డిక్క‌ల్

IPL 2025 : ఐపీఎల్ 18వ సీజ‌న్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ ప్ర‌తీకార విజ‌యం సొంతం చేసుకుంది. చిన్న‌స్వామి మైదానంలో ఆర్సీబీని చిత్తు చిత్తుగా ఓడించిన పంజాబ్ కింగ్స్‌‌పై ఏడు వికెట్ల తేడాతో విజ‌య‌ ఢంకా మోగించింది. మొదట సుయాశ్ శ‌ర్మ‌ (2-26),, కృనాల్ పాండ్యా (2-25)ల విజృంభ‌ణ‌తో పంజాబ్‌ కింగ్స్‌ను 157 పరుగులకే క‌ట్ట‌డి ఆర్సీబీ కట్టడి చేసింది. లక్ష్య ఛేద‌న‌లో ఆర్సీబీ చెలరేగింది. పంజాబ్ బౌలర్ల‌కు విరాట్ కోహ్లీ ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వలేదు. కోహ్లీ (73 నాటౌట్) ఇప్యాంక్ట్ ప్లేయ‌ర్ దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్ (61)లతో అర్ధసెంచరీతో చెలరేగాడు. జితేశ్ శ‌ర్మ‌ (11) సిక్స‌ర్ కొట్టడంతో మ‌రో ఏడు బంతులు ఉండ‌గానే బెంగళూరు ల‌క్ష్యాన్ని ఛేదించింది.

 

సొంత‌గడ్డ‌పై చ‌తికిల‌ప‌డుతూ..
ఆర్సీబీ జట్టు సొంత‌గడ్డ‌పై చ‌తికిల‌ప‌డింది. వేరే మైదానాల్లో విజయం సాధిస్తూ అదే సంప్ర‌దాయాన్ని కొన‌సాగించింది. పంజాబ్ జట్టును సొంత ఇలాకాలో చిత్తు చిత్తుగా ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. 158 ప‌రుగుల లక్ష్య ఛేద‌న‌లో కోహ్లీ (73 నాటౌట్) క్లాస్ ఇన్నింగ్స్‌తో క‌దం తొక్కాడు. ఇప్యాంక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చిన దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్ (61) అదిరిపోయే బ్యాటింగ్‌తో చెల‌రేగాడు. వీళ్లిద్ద‌రి మెరుపుల‌తో గెలుపు దిశ‌గా దూసుకెళ్లిన ఆర్సీబీ 18.5 ఓవ‌ర్లలో ల‌క్ష్యాన్ని చేరుకుని అయ్య‌ర్ బృందానికి పెద్ద షాక్ ఇచ్చింది.

 

 

ఇవి కూడా చదవండి: