IPL 2025 : చెన్నై విజయ లక్ష్యం 183

IPL 2025 : ఐపీఎల్‌లో భాగంగా చెన్నైతో జరుగుతోన్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ముగిసింది. 20 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. నితీశ్ రాణా (81) పరుగులతో అదరగొట్టాడు. కెప్టెన్ పరాగ్(37) పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యారు. చెన్నై బౌలర్లలో నూర్, ఖలీల్, పతిరణ రెండేసి వికెట్లు తీశారు. అశ్విన్, జడేజా చెరో వికెట్ పడగొట్టాడు.
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన రాజస్థాన్ రాయల్స్‌కు మరోసారి శుభారంభం దక్కలేదు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (4) తొలి ఓవర్లోనే వికెట్ పారేసుకున్నాడు. ఖలీల్ అహ్మద్ ఊరిస్తూ వేసిన బంతిని ఆడి అశ్విన్‌కు దొరికిపోయాడు. ఆ తర్వాత సంజూ శాంసన్ (16)కు జత కలిసిన నితీశ్ రాణా దూకుడుగా ఆడాడు.