Last Updated:

IPL 2025 : రాణించిన ముంబయి బౌలర్లు.. కేకేఆర్ 116 పరుగులకే ఆలౌట్

IPL 2025 : రాణించిన ముంబయి బౌలర్లు.. కేకేఆర్ 116 పరుగులకే ఆలౌట్

IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్‌లో వరుసగా ఓడిపోతున్న ముంబయి ఇండియన్స్ సొంత గ్రౌండ్‌లో విరుచుకు పడింది. ముంబయిలోని వాంఖడే మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. మ్యాచ్‌లో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్య బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో కోల్‌కతా టీం బ్యాటింగ్‌కు దిగింది. కెప్టెన్ హార్దిక్ నమ్మకాన్ని నిలబెట్టిన ముంబయి బౌలర్లు కోల్‌కతాను ఆదిలోనే దెబ్బతీశారు. 116 పరుగులకే ఆలౌట్ చేశారు. తొలి మ్యాచ్ ఆడుతున్న ముంబయి బౌలర్ అశ్వని కుమార్ నాలుగు వికెట్లు తీసి కోల్‌కతా పతనాన్ని శాసించాడు.

 

 

ముంబయి బౌలర్ ట్రెంట్ బౌల్ట్ తొలి ఓవర్లో సునీల్ నరైన్ (0)ను మంచి యార్కర్‌తో ఔట్ చేశాడు. ఐపీఎల్‌లో మొదటి ఓవర్‌లో వికెట్ తీయడం బౌల్ట్‌కు ఇది 30వ సారి. రెండో ఓవర్లో కోల్‌‌కతాకు గట్టి షాక్ తగిలింది. మ్యాచ్‌లో 97 పరుగులు చేసి జట్టును గెలిపించిన డికాక్ (1)ను దీపక్ చాహర్ ఔట్ చేశాడు. ఒక సిక్స్, ఒక ఫోర్ కొట్టి జోరుమీదున్న కెప్టెన్ రహానే (11)ను కొత్త బౌలర్ అశ్విని కుమార్ ఔట్ చేశాడు. ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న అశ్విని తొలి బంతికే రహానేను ఔట్ చేశాడు. తర్వాత దీపక్ చాహర్ మరో బ్రేక్ ఇచ్చాడు. వెంకటేశ్ అయ్యర్ (3)ను ఔట్ చేశాడు.

 

 

పవర్ ప్లే ముగిసే సరికి కోల్‌కతా 41 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత మంచిగా ఆడుతున్న రఘువంశీ (26)ని హార్దిక్ పాండ్య ఔట్ చేశాడు. రింకూ సింగ్ (17) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన మనీష్ పాండే (19) కూడా స్వల్ప స్కోరుకే ఔట్ అయ్యాడు. రస్సెల్ (5), దీంతో కోల్‌కతా 16.2 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌటైంది. ముంబయి బౌలర్లలో తొలి మ్యాచ్ ఆడుతున్న అశ్వని కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్ 2 వికెట్లు తీశాడు. బౌల్ట్, హార్దిక్, విఘ్నేష్ పుత్తుర్, శాంట్నర్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి: