Published On:

WTC: టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్.. ప్రైజ్ మనీ ఎంతంటే?

WTC: టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్.. ప్రైజ్ మనీ ఎంతంటే?

ICC: మరికొద్ది రోజుల్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ మ్యాచ్ జరగనుంది. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్ కు ఇప్పటికే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా అర్హత సాధించాయి. ఈ ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పోరు లార్డ్స్ వేదికగా జరగనుంది. అయితే ఈ పోరుకు సంబంధించి ప్రైజ్ మనీని ఐసీసీ భారీగా పెంచేసింది. ఆ వివరాలను ఇవాళ ప్రకటించింది.

 

అయితే 2023- 25 డబ్ల్యూటీసీ ఫైనల్ కు ఇచ్చిన ప్రైజ్ మనీ కంటే రెండింతలు పెంచారు. విజేతగా నిలిచిన జట్టుగా ఈసారి 36 లక్షల డాలర్లు అంటే రూ. 30.78 కోట్లు, ఇక రన్నరప్ జట్టుకు రూ. 18.46 కోట్ల నజరానా ఇవ్వనున్నట్టు ఐసీసీ వెల్లడించింది. మొత్తం 8 జట్లకు కలిపి ప్రైజ్ మనీ రూ. 49.27 కోట్లు ఇవ్వనున్నామని స్పష్టం చేసింది. కాగా 2023లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో ఇండియాపై ఆస్ట్రేలియా గెలిచింది. ఆ జట్టుకు 1.6 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ దక్కగా, రన్నరప్ గా నిలిచిన ఇండియా జట్టుకు 8 లక్షల డాలర్లు ప్రైజ్ మనీ ఇచ్చింది. కాగా టెస్ట్ క్రికెట్ కు ఉన్న క్రేజ్ ను మరింతగా పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐసీసీ వెల్లడించింది. అందువల్ల ఎక్కువ జట్లు టెస్ట్ క్రికెట్ ఆడేందుకు ముందుకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది.

 

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ సిరీస్ లిస్ట్ లో 69.44 పాయింట్లతో సౌతాఫ్రికా ఫస్ట్ ప్లేస్ ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా 67.54 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక టీమిండియా 50 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.