Published On:

Ravindra Jadeja: జడేజా పేరిట అరుదైన రికార్డు.. క్రికెట్ చరిత్రలోనే!

Ravindra Jadeja: జడేజా పేరిట అరుదైన రికార్డు.. క్రికెట్ చరిత్రలోనే!

Ravindra Jadeja First Rank in Test Cricket All Rounder: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పేరిట అరుదైన రికార్డు నమోదైంది. ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అంతేకాకుండా రవీంద్ర జడేజా నంబర్ వన్ స్థానంలో సుదీర్ఘంగా కొనసాగుతున్న ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ మేరకు 1,151 రోజులుగా నంబర్ వన్ స్థానంలో రవీంద్ర జడేజా కొనసాగుతున్నాడు.

 

ఇక, ఐసీసీ టెస్ట్ ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌ ప్రకటించగా.. టెస్ట్ ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లోరవీంద్ర జడేజా 400 పాయింట్లతో నంబర్ వన్‌ స్థానం పదిలంగా ఉంది. జడేజా తర్వాత 327 పాయింట్లతో నంబర్ టూ స్థానంలో బంగ్లాదేశ్ క్రికెటర్ మెహదీ హసన్ మీరాజ్ ఉన్నాడు. ఆ తర్వాత వరుసగా 294 పాయింట్లతో దక్షిణాఫ్రికా ప్లేయర్ మార్కో యన్సెన్ 294 పాయింట్లతో మూడో స్థానం, ఆస్ట్రేలియా ప్లేయర్ పాట్ కమిన్స్ 271 పాయింట్లతో నాలుగో స్థానం, బంగ్లాదేశ్ ప్లేయర్ షకీబ్ అల్ హసన్ 253పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నారు.

 

ఇక, 249 పాయింట్లతో వెస్టిండీస్ ప్లేయర్ జాసన్ హోల్డర్ ఆరో స్థానం, 247 పాయింట్లతో ఇంగ్లాండ్ ప్లేయర్ జోరూట్ ఏడో స్థానం, 240 పాయింట్లతో ఇంగ్లాండ్ ప్లేయర్ గస్ అట్కిన్సన్ ఎనిమిదో స్థానం, 235 పాయింట్లతో ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్ స్టోక్స్ తొమ్మిదో స్థానం, 225 పాయింట్లతో ఇంగ్లాండ్ ప్లేయర్ క్రిస్ వోక్స్ పదో స్థానంలో ఉన్నారు.

 

ఇవి కూడా చదవండి: