Pathaan Movie Review: స్పై యూనివర్స్ స్టార్ట్ చేసిన షారూఖ్ ఖాన్.. పఠాన్ మూవీ ఎలా ఉందంటే?
Cast & Crew
- షారూఖ్ ఖాన్ (Hero)
- దీపికా పదుకునే (Heroine)
- జాన్ అబ్రహం, అశుతోష్ రాణా, డింపుల్ కపాడియా, తదితరులు (Cast)
- సిద్ధార్థ్ ఆనంద్ (Director)
- ఆదిత్య చోప్రా (Producer)
- విశాల్ చంద్ర శేఖర్ (Music)
- (Cinematography)
Pathaan Movie Review: బాలీవుడ్ బాద్ షా “షారుఖ్ ఖాన్” నటించిన తాజా చిత్రం “పఠాన్”.
సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తుంది.
మరో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం విలన్ గా నటించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు.
చాలా కాలం తర్వాత ఫుల్ యాక్షన్ స్వింగ్‌లో షారుఖ్ రాబోతుండడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
మరోవైపు ఈ సినిమాను వివాదాలు కూడా గట్టిగానే చుట్టుముట్టాయి.
అయితే మొత్తానికి అవన్నీ దాటుకొని నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా 100 కు పైగా దేశాల్లో 2500 పైగా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది.
ఈ తరుణంలో మరి సినిమా అంచనాలను అందుకునేలా ఉందా? షారూఖ్ ఖాన్ ‘పఠాన్’గా అదరగొట్టారా ? షారూఖ్, దీపిక మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది? మూవీఆడియన్స్ ని మెప్పించిందా అనేది.. మీకోసం ప్రత్యేకంగా
సినిమా కథ..
భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేస్తుంది. దీంతో పాకిస్థాన్ జనరల్ ఖాద్రి ఇండియాపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. దీంతో అతను జిమ్ (జాన్ అబ్రహం)తో చేతులు కలిపి.. ఎవరూ ఊహించలేని ప్లాన్‌తో ఇండియా లోని ప్రజలను చంపి శాంతి భద్రతలను డెబ్బ తీయాలని అనుకుంటాడు. అదే సమయంలో భారతదేశానికి చెందిన స్పై .. పఠాన్ (షారూఖ్ ఖాన్) ఎంట్రీ ఇస్తాడు. అజ్ఞాత వాసంలో ఉన్న పఠాన్ ఇండియాని కాపాడటానికి తన వంతు ప్రయత్నాలను ప్రారంభిస్తాడు. అప్పుడే అతనికి పాకిస్థాన్‌కి చెందిన ఐఎస్ఐ ఏజెంట్ రూబై (దీపికా పదుకొనె) పరిచయం అవుతుంది. ఆమె సాయంతో జిమ్ ప్లాన్‌ను నాశనం చేయాలనుకుంటాడు. అయితే రూబై పఠాన్‌కి ఏ విధంగా షాక్ ఇచ్చింది. అప్పుడు పఠాన్ ఏం చేస్తాడు. పఠాన్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎలా బయటపడ్డాడు? అసలు జిమ్ కి భారతదేశంతో ఉన్న సంబంధం ఏంటి? చివరకు జిమ్ వేసిన ప్లాన్‌ను పఠాన్ ఎలా అడ్డుకున్నాడు? అనేది ప్రధానంగా సినిమాలో చూడవచ్చు.
మూవీ విశ్లేషణ (Pathaan Movie Review)..
ఏకంగా నాలుగేళ్ల పాటు సినిమాల్లో హీరోగా నటించకుండా గ్యాప్ తీసుకున్నారు షారూఖ్. మధ్య మధ్యలో రెండు, మూడు చిత్రాల్లో అతిథి పాత్రల్లో కనిపించినప్పటికి అవి ఆయన ఫ్యాన్స్ ని ఖుషి చేయలేకపోయాయి. ఈ సినిమా ఆయన ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేసిందని చెప్పాలి. అలాగే ఈ మూవీతో స్పై ఉనివర్స్ ని స్టార్ట్ చేశాడు దర్శకుడు.
‘పఠాన్’ సినిమాని ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇద్దరు సైనికుల మధ్య జరిగే పోరు. ఒకరేమో నేను కష్టాల్లో ఉంటే దేశం నాకేం చేయలేదు అని భావించి దేశంపై పగ తీర్చుకునే సైనికుడు.. మరో వైపు దేశం నాకేమీ చేసిందనే దానికంటే దేశానికి నేనేం చేశాను అని ఆలోచించి ప్రాణాలను పణంగా పెట్టే సైనికుడు. వారి మధ్య జరిగే పోరులో దేశాన్ని ఎలా కాపాడాడు అనే కథని దర్శకుడు అద్బుతంగా తెరకెక్కించాడు.
నాలుగేళ్ల తర్వాత బిగ్ స్క్రీన్‌పై షారూఖ్ ఖాన్ తనదైన లుక్స్, స్టైల్, మేనరిజమ్‌తో పాటు వావ్ అనిపించే యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకున్నారు. ఐదు పదులు వయసు దాటిన ఫిజిక్ తో షారూఖ్ అందరికీ షాక్ ఇచ్చాడు.
ఇక దీపికా పదుకొనె బేషరమ్ సాంగ్‌లో అందాలను ఆరబోయడమే కాకుండా.. యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా అదరగొట్టింది.
ఇక విలన్‌గా నటించిన జాన్ అబ్రహం తన నటనతో అందర్నీ ఆకట్టుకున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో షారూఖ్‌ను ఢీ కొట్టాలంటే ఆ మాత్రం ఫిజిక్ ఉన్నవిలన్ అవసరం అనిపించేలా కనిపించాడు జాన్ అబ్రహం.
వీరితో పాటు గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన సల్మాన్ ఖాన్.. సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు.
స్పై థ్రిల్లర్ మూవీస్ సిరీస్ ఏక్ థా టైగర్, టైగర్ రిటర్న్స్ చిత్రాలకు పఠాన్ సినిమాను బాగా లింక్ చేశారు. ఇక మిగిలిన నటులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.
మైండ్ గేమ్, యాక్షన్ ప్రధానంగా పఠాన్ సినిమాను సిద్ధార్థ్ బాగా తెరెక్కించారు. బయో వార్ అనే పాయింట్‌ను ఇంట్రెస్టింగ్‌గానే చూపిస్తూ దాంట్లో కావాల్సిన గ్లామర్‌ను దట్టించాడు. ఇక యాక్షన్ సన్నివేశాలను కూడా మైండ్ బ్లోయింగ్ లెవెల్లో తెరకెక్కించాడు. మ్యూజిక్ కూడా బాగానే ఉంది.
కంక్లూజన్..
మొత్తానికి ఈ సినిమాతో బాలీవుడ్ కి మంచి హిట్ దక్కిందని చెప్పాలి.