Sikandar Teaser: సల్మాన్ ఖాన్ సికింగర్ టీజర్ రిలీజ్
Sikandar Teaser Out: బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సికందర్’. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఎమోషనల్ అండ్ యాక్షన్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం టీజర్‌ని తాజాగా మూవీ టీం విడుదల చేసింది.
ఇవాళ సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సికందర్ టీజర్ విడుదల చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది మూవీ టీం. ఈ చిత్రంలో సల్మాన్ పాత్ర తీరును తెలుపుతూ టీజర్‌ని మలిచారు. తనపై దాడి చేయడానికి వచ్చిన వారితో ఆయన ఫైట్ చస్తూ కనిపించారు. ప్రస్తుతం సికందర్ టీజర్ బాగా అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. వచ్చే ఏడాది రంజాన్‌కు ఈ సినిమా విడుదల కానుంది.
కాగా ఎప్పుడో రావాల్సిన ఈ టీజర్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియల నేపథ్యంలో ఆలస్యం అయ్యింది. కాసేటి క్రితమే ఢిల్లీలో అధికారిక లాంఛనాల మధ్య ఆయన అంత్యక్రియలు ముగిశాయి. దీంతో సల్మాన్ ఫ్యాన్స్ కోసం మేకర్స్ టీజర్ విడుదల చేసింది. ఇందులో సల్మాన్ లుక్, యాక్షన్ ఎపిసోడ్స్ చూసి భాయ్ ఈజ్ బ్యాక్ అంటూ మురిసిపోతున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ చివరిగా టైగర్ 3లో కనిపించారు.
టైగర్ మూవీ సీక్వెన్స్ గా వచ్చిన ఈ సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే రిలీజ్ తర్వాత ఈ చిత్రం ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ కాలేకపోయింది. మంచి టాక్ తెచ్చుకున్న బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ చేయలేకపోయింది. ఆ తర్వా కిసికా భాయ్ కిసికా జాన్ చిత్రంలో నటించాడు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం పొందింది. టాలీవుడ్ హీరోలు విక్టరీ వెంకటేష్, రామ్ చరణ్ లు అతిథి పాత్రలో మెరిసిన అది ఈ సినిమాకు ప్లస్ కాలేకోపోయింది.