Salman Khan-Aishwarya Rai: సల్మాన్, ఐశ్యర్య బ్రేకప్‌కు కారణం ఇదే – సోహైల్ ఖాన్ కామెంట్స్ వైరల్

Salman Khan Always Feel Insecure in Love With Aishwarya: బాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచీలర్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు సల్మాన్ ఖాన్. ఈ కండల వీరుడు ఎప్పుడెప్పుడు ఓ ఇంటివాడు అవుతాడా? ఇప్పటికీ అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. ఆరు పదుల వయసులో ఉన్న సల్మాన్ ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నారు. అయితే ఆయన ఇండస్ట్రీలో చాలానే ప్రేమ వ్యవహరాలను నడిపిన సంగతి తెలిసిందే. చెప్పాలంటే ఆయన ప్రియురాళ్ల జాబితా చాలా పెద్దది. ఇండస్ట్రీలో ఏ హీరోయిన్‌ని చూసిన ఆమె ఏదోక టైంలో సల్మాన్‌తో డేటింగ్ లేదా రిలేషన్‌లో ఉండే ఉంటుంది.
అందులో మాజీ విశ్వసుందరి, నటి ఐశ్వర్యరాయ్ ఒకరు. అప్పట్లో వీరిద్దరి ప్రేమయాణం బి-టౌన్‌లో హట్ టాపిక్‌గా ఉండేది. వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నప్పటికి ఎప్పుడు దీనికి బహిరంగంగా చెప్పలేదు. కానీ, సినిమా ఈవెంట్స్, అవార్డు ఫంక్షన్‌లో వీరిద్దరు జంటగా కనిపించేవారు. దీంతో ఐశ్వర్య, సల్మాన్‌లో రిలేషన్‌లో ఉన్నట్టు రూమర్స్ వచ్చేవి. ఇక వీరిద్దరు పెళ్లి కబురు చెబుతారనుకుంటే బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు. అప్పట్లో ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. కారణలు తెలియదు కానీ, ఐశ్వర్య, సల్మాన్‌లు బ్రేకప్ చెప్పుకోవడంతో ఫ్యాన్స్ నిరాశ పడ్డారు. బ్రేకప్ తర్వాత వీరిద్దరు బద్ద శత్రువుల్లా వ్యవహరించారు. ఎక్కడ ఎదురుపడ్డ ఒకరినొకరు చూసుకోవవడం కానీ, పలకరించుకోవడం కానీ చేసేవారు కాదు. ఈ క్రమంలో ఐశ్వర్య ఓ ఇంటర్య్వూలో తన పాస్ట్ రిలేషన్ గురించి చెప్పుకొచ్చింది.
ఇందులో సల్మాన్ పేరు ప్రస్తావించకుండ తమ బ్రేకప్‌కు కారణాలు బయటపెట్టింది. తన పాస్ట్ రిలేషన్‌లో తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని, మాజీ ప్రియుడు తనని శారీరకంగా, మానసికంగా హింసించేవాడని చెప్పింది. అంతేకాదు ఎప్పుడూ అనుమానిస్తూ చుక్కలు చూపించేవాడని ఆరోపించింది. అప్పట్లో ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి. అయితే ఐశ్వర్య వ్యాఖ్యలపై సల్మాన్ ఎప్పుడు స్పందించలేదు. కానీ, అదే సమయంలో సల్మాన్ సోదరు సోహైల్ ఖాన్ మాత్రం ఐశ్వర్య కామెంట్స్‌పై ఇన్‌డైరెక్ట్‌గా స్పందించాడు. గతంలో అతడు చేసిన కామెంట్స్ తాజాగా మరోసారి తెరపైకి వచ్చాయి. కారణం తెలియదు కానీ, సోహైల్ ఖాన్.. గతంలో ఐశ్వర్య-సల్మాన్ ఖాన్‌లో బ్రేకప్ చేసిన కామెంట్స్ మరోసారి హాట్ టాపిక్‌గా నిలిచాయి.
ఓ పాత ఇంటర్య్వూలో సోహైల్ ఇలా అన్నాడు. “సల్మాన్ ఎప్పుడు తన రిలేషన్‌లో అభద్రత భావంతో ఉండేవాడు. ఇప్పుడు ఎవరైతే బయటకు వచ్చిన దొంగ ఏడుపు ఏడుస్తున్నారో. వారి వల్లే ఆ రిలేషన్ బ్రేకప్ అయ్యింది. మా ఖాన్ కుటుంబ ఐశ్వర్యని ఎప్పుడు తమ ఫ్యామిలీగానే చూసింది. తరచూ ఆమె మా ఇంటికి కూడా వచ్చేది. కానీ తమ రిలేషన్‌ని మాత్రం సీక్రెట్‌గా ఉంచేది. బయటకు చెప్పనిచ్చేది కాదు. దీంతో ఆమె ఈ రిలేషన్‌ని నిజంగానే అంగీకరించిందా అనే అనుమానాలు వస్తుండేవి. దానివల్ల సల్మాన్ ఆ రిలేషన్‌లో అభద్రతా భావంతో ఉండేవాడు. తాను ఈ రిలేషన్‌లో ఉంటుందా? వెళ్లిపోతుందా? అని తరచూ ఆవేదన వ్యక్తం చేసేవాడు. అందువల్ల తరచూ ఆమె తనని ఎంతగా కోరుకుంటుందో తెలుసుకోవాలనుకునేవాడు.కానీ ఆమె మాత్రం ఈ విషయాన్ని ఎప్పుడు బయటకు చెప్పలేదు” అని ఓ పాత ఇంటర్య్వూలో సోహైల్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ బ్రేకప్ తర్వాత సల్మాన్, ఐశ్వర్యల మధ్య కొంతకాలం పాటు మాటలు లేవు. అదే సమయంలో ఆమె 2007లో అభిషేక్ బచ్చన్‌ని పెళ్లి చేసుకుంది. వీరికి 20212లో ఆరాధ్య జన్మించింది.
ఇవి కూడా చదవండి:
- Yamadonga Re Release Trailer: తారక్ బర్త్‌డే ట్రీట్, మరోసారి థియేటర్లకు ‘యమదొంగ’ – రీ రిలీజ్ ట్రైలర్ చూశారా?