Last Updated:

Atlee-Allu Arjun Movie: ఇప్పట్లో అట్లీతో సినిమా లేదు – స్టార్‌ హీరో క్లారిటీ, ఖుషి అవుతున్న బన్నీ ఫ్యాన్స్‌

Atlee-Allu Arjun Movie: ఇప్పట్లో అట్లీతో సినిమా లేదు – స్టార్‌ హీరో క్లారిటీ, ఖుషి అవుతున్న బన్నీ ఫ్యాన్స్‌

Salman Khan About Atlee Movie: కోలీవుడ్‌ డైరెక్టర్‌ అట్లీ సక్సెస్‌ ఫుల్‌ డైరెక్టర్‌గా ఫుల్‌ క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఇటీవల బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌తో ‘జవాన్‌’ మూవీ తీసి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టాడు. ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్‌ చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమా వచ్చే దాదాపు రెండేళ్లు అవుతుంది. ఇంతవరకు అతడి నెక్ట్స్‌ మూవీ ఏంటనేది క్లారిటీ లేదు. బాలీవుడ్‌లోనే మళ్లీ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ని లైన్‌లో పెట్టాడని బి-టౌన్‌ గుసగుసలు వినిపిస్తున్నాయి.

సల్మాన్? లేక అల్లు అర్జున్?

మరోవైపు అల్లు అర్జున్‌తో కూడా మూవీ ఉండనుందనే విషయం తెలిసిందే. ఈ ఇద్దరి హీరోల్లో ఎవరితో ముందుగా సినిమా చేస్తాడా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సల్మాన్‌ ఖాన్‌తోనే అట్లీ నెక్ట్స్‌ మూవీ ఉంటుందని బాలీవుడ్‌ మీడియాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. సోర్స్‌ కూడా అవును అన్నట్టుగానే ఉన్నాయి. మరోవైపు అల్లు అర్జున్‌, అట్టీ మూవీ ఫిక్స్‌ అయ్యిందని, త్వరలోనే దీనిపై ప్రకటన కూడా రానుందని అంటున్నారు. దీంతో అట్లీ నెక్ట్స్‌ సినిమా సల్మాన్‌తోనా? అల్లు అర్జున్‌తోనా? అనే డైలామాలో పడిపోయారు ఫ్యాన్స్‌.

ఇది భారీ బడ్జెట్ మూవీ

ఈ క్రమంలో స్వయంగా స్టార్‌ హీరోనే అట్లీ చిత్రంపై క్లారిటీ ఇచ్చారు. బాలీవుడ్‌ భాయిజాన్‌ సల్మాన్‌ ఖాన్‌ తాజాగా ఓ బాలీవుడ్‌ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ప్రస్తుతం అతడు ఎదర్కొంటున్న పరిస్థితులపై స్పందించారు. అలాగే తన సినిమాలపై కూడా మాట్లాడారు. అట్లీతో ఓ సినిమా చేస్తున్నానని, కానీ ఇది ఇప్పట్లో ఉండదన్నారు. దీనికి ఇంకా టైం పడుతుందన్నారు. ఇది భారీ బడ్జెట్‌ సినిమా కావడంతో కాస్తా వేయిదా వేస్తున్నట్టు సల్మాన్‌ చెప్పుకోచ్చారు. దీంతో ఇప్పటల్లో సల్మాన్‌తో అట్లీ మూవీ ఉండదనే క్లారిటీ వచ్చేసింది. ఇది తెలిసి బన్నీ ఫ్యాన్స ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు.

బన్నీ బర్త్ డే సర్ప్రైజ్ 

లేటెస్ట్ బజ్ ప్రకారం.. నెక్ట్స్‌ అల్లు అర్జున్‌-అట్లీ మూవీ దాదాపు ఖారారైనట్టు అని తెలుస్తోంది. పుష్ప 2 చిత్రం తర్వాత బన్నీ తరువాత మూవీ ఏంటా అని ఫ్యాన్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో త్రివిక్రమ్‌తో చేస్తున్నాడనే టాక్‌ గట్టిగా వినిపించింది. కానీ, ఇటీవల మళ్లీ అట్లీ పేరు తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించి స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా పూర్తయ్యిందని తెలుస్తోంది. అంతేకాదు మూవీ కాస్ట్‌ సెలక్షన్స్ అవుతుందని, అట్లీ మూవీకి బన్నీ రెమ్యునరేషన్‌ కూడా లాక్‌ అయినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్‌పై అల్లు అర్జున్‌ బర్త్‌డే ఏప్రిల్‌ 8న అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.