Last Updated:

Salman Khan About injuries: పక్కటెముకలో గాయం – అయినా రోజు 14 గంటలు పాటు షూటింగ్‌, తీవ్ర నొప్పితో బాధపడ్డాను

Salman Khan About injuries: పక్కటెముకలో గాయం – అయినా రోజు 14 గంటలు పాటు షూటింగ్‌, తీవ్ర నొప్పితో బాధపడ్డాను

Salman Khan Open Up on Injury: బాలీవుడ్‌ భాయిజాన్ ప్రస్తుతం ‘సికందర్’ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. ఈథ్‌ సందర్భంగా మార్చి 30న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ టీం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఇక సల్మాన్‌ పబ్లిక్‌ ఈవెంట్స్‌ కాకుండ ఇంటర్య్వూలో పాల్గొంటూ తన సినిమా ప్రమోషన్స్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో వరుస ఇంటర్య్వూలో పాల్గొంటున్నారు.

ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్టనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌తో కలిసి ముచ్చటించాడు. ఈ సందర్భంగా వీరిద్దరు ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇక మన ఇద్దరి డ్యాన్స్‌ ఎవరూ బాగా చేస్తారనగా.. దానికి సల్మాన్‌ తానే అంటూ సమాధానం ఇచ్చాడు. దీనికి కారణం కూడా వివరిస్తూ సికందర్‌ షూటింగ్ జరిగిన గాయం గురించి చెప్పుకొచ్చాడు. “సికందర్‌ షూటింగ్‌ టైంలో నాకు గాయమైంది. యాక్షన్‌ సీన్స్‌ చేస్తుండగా నా పక్కటేముకకు గాయమైంది. కూర్చున్న, నిలబడ్డ కూడా నొప్పిగా ఉండేది. కనీసం దగ్గడం, నవ్వడం కూడా కష్టం ఉండేది. అయినా ఆ గాయంతోనే షూటింగ్‌లో పాల్గొన్నాను. ఇక ఆ రోజు పాట షూటింగ్ జరిగింది.

గాయంతోనే డ్యాన్స్‌ చేశాను. ఒక స్టెప్‌ వేసే సమయంలో నొప్పితో పక్కటెముకలు పట్టుకున్నాయి. దీంతో స్టెప్‌ వేస్తూనే నొప్పి కలిగిన వెంటనే అక్కడ చేయితో పట్టుకున్నాను. కొరియోగ్రాఫర్‌ దాన్నే కొత్త స్టెప్‌గా తీర్చిదిద్దారు. ఈ స్టెప్‌ కూడా బాగుందని దాన్నే అందరు అనుసరించాలని డ్యాన్సర్లు చెప్పారు. దీంతో డ్యాన్సర్లంతా అదే స్టెప్‌ ఫాలో అయ్యారు” అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు. మూవీ ఈవెంట్‌లో డైరెక్టర్‌ మురుగదాస్‌ సల్మాన్‌కు గాయమైన షూటింగ్‌ మాత్రం ఆపలేదని చెప్పిన సంగతి తెలిసిందే. ఇటీవల ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌ డైరెక్టర్‌ మాట్లాడుతూ.. సల్మాన్‌ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని, గాయంతోనే రోజూ 14 గంటల షూటింగ్‌లోనే పాల్గొనేవారని చెప్పారు.

ఇవి కూడా చదవండి: