Published On:

Abhinav Shukla: నీ భార్య క్షమాపణలు చెప్పాలి, లేదంటే చంపేస్తాం – మరో బాలీవుడ్‌ హీరోకి బిష్ణోయ్‌ గ్యాంగ్‌ బెదిరింపులు

Abhinav Shukla: నీ భార్య క్షమాపణలు చెప్పాలి, లేదంటే చంపేస్తాం – మరో బాలీవుడ్‌ హీరోకి బిష్ణోయ్‌ గ్యాంగ్‌ బెదిరింపులు

Lawrence Bishnoi Gang Target Another Bollywood Actor: గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ తరచూ హత్య బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే గ్యాంగ్‌ నుంచి మరో బాలీవుడ్‌ హీరోకి బెదిరింపులు వచ్చాయి. తన భార్య క్షమాపణలు చెప్పాలని, లేదంటే తమ ఇంటిపై కూఆ కాల్పులు జరుపుతామని, చంపేస్తామంటూ ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో వరుస మెసేజ్‌లతో బెదిరింపులకు పాల్పడ్డాడ. అంతేకాదు తాను లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ కోసం పనిచేస్తున్నానని కూడా స్పష్టం చేశాడు.

 

ఇందుకు సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ని స్వయంగా ఆ హీరోనే షేర్‌ చేశాడు. అతడు మరెవరో కాదు బుల్లితెర నటుడు, బిగ్‌బాస్‌ ఫేం అభినవ్‌ శుక్లా. ఆయన భార్య రుబీనా కూడా బిగ్‌బాస్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ మెసేజ్‌లను ఓ సోషల్‌ మీడియా యూజర్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ బెదిరింపుల కారణం అభినవ్‌ భార్య రుబినా అని అతడు పంపిన మెసేజ్‌లు చూస్తే తెలుస్తోంది. ప్రముఖ టీవీలో ప్రసారం అయ్యే బాటిల్‌గ్రౌండ్‌ షోలో ఇటీవల రుబినా పాల్గొంది. ఈ షో జరుగుతుండగా.. మధ్యలో రాపర్ ఆసిమ్‌ రియాజ్‌తో ఆమెకు గొడవ జరిగింది. ఒకరినొకరు వాదించుకుంటూ మాటల యుద్దానికి దిగారు. కాసేపటి వరకు షోలో పెద్ద వాగ్వాదమే జరిగింది.

 

అది జరిగిన కొన్ని గంటల్లోనే ఈ బెదిరింపులు వచ్చాయి. అభినవ్‌, రుబీనాలను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్‌లో వరుసగా హత్యా బెదిరింపులు మెసేజ్‌లు పంపాడు ఓ సోషల్‌ మీడియాలో యూజర్‌. వాటిని అభినవ్‌ స్క్రీన్‌ షాట్‌ తిసి షేర్‌ చేశాడు. “నేను లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి వచ్చాను. మీ అడ్రస్‌ నాకు తెలుసు. నేను రావాలా? సల్మాన్‌ ఖాన్‌ ఇంటిపై కాల్పులు జరిపినట్టే మీ ఇంటికి వచ్చిన AK-47తో మిమ్మల్ని కాల్చివేస్తాను. ఇదే చివరి హెచ్చరిక అనుకోండి. వెంటనే రుబీనా.. ఆసీమ్‌కు క్షమాపణలు చెప్పాలి. అలా చేయలేదంటే మిమ్మల్నీ ఎవరూ కాపాడలేరు. లారెన్స్‌ బిష్ణోయ్‌.. ఆసిమ్‌కు అండగా నిలుస్తారు. ఆసిమ్‌ మా గ్యాంగ్‌ మనిషి” అని ఉంది. ప్రస్తుతం ఈ బెదిరింపులు మెసేజ్‌ బి-టౌన్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు అభినవ్‌ చెప్పాడు.