Salman Khan: జైల్లో ఉన్నప్పుడే హాయిగా నిద్రపోయా – 45 నిమిషాల్లో చావు అంచుల వరకు వెళ్లొచ్చాను..
![Salman Khan: జైల్లో ఉన్నప్పుడే హాయిగా నిద్రపోయా – 45 నిమిషాల్లో చావు అంచుల వరకు వెళ్లొచ్చాను..](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/salmaan-khan.jpg)
Salman Khan recalls near death experience in Flight: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ మధ్య ఆయనకు హత్యా బెదిరింపులు ఎక్కువ అయిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో భారీ భద్రత నడుమ ఆయన సినిమా షూటింగ్స్, ఇతర కార్యక్రమాలకు వెళ్తున్నారు. అయితే తాజాగా సల్మాన్ తన సోదరుడు అర్భజ్ ఖాన్ కొడుకు అర్హాన్ ఖాన్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సల్మాన్ తన గురించిన ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
తన స్లీపింగ్ షెడ్యూల్ గురించి చెప్పి అందరిని సర్‌ప్రైజ్ చేశాడు. తాను చాలా తక్కువ నిద్రపోతానన్నాడు. జైల్లో ఉప్పుడు మాత్రమే కావాల్సినంత నిద్రపోయానంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ హాట్‌టాపిక్‌గా మారాయి. “సాధారణంగా రోజుకు రెండు గంటలు మాత్రం నేనే నిద్రపోతాను. నెలకోకసారి మాత్రమే 8 గంటలు పడుకుంటాను. అప్పుడప్పుడు షూటింగ్ విరామ సమయంలో కాస్తా కునుక తీస్తాను. షూటింగ్స్ ఏం లేనప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే కావాల్సినంత నిద్రపోతాను. అందుకే జైల్లో ఉన్నప్పుడు 8 గంటలు హాయిగా నిద్రపోయాను” అని చెప్పుకొచ్చాడు.
అలాగే విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఒకసారి శ్రీలంకలో జరిగిన ఐఫా అవార్డ్స్ ఈవెంట్ నుంచి తిరిగి వస్తుండగా తాను ప్రయాణిస్తున్న విమానంలో టెక్నికల్ ఇష్యూ వచ్చిందన్నారు. ఐఫా అవార్డు నుంచి వస్తుందడా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఫ్లైయిట్‌లో ఒక్కసారిగా అల్లోకల్లోలం ఏర్పడింది. ఫ్లైయిట్ క్రాష్ అవుతున్నట్టుగా పెద్ద శబ్ధాలు వచ్చాయి. దీంతో అందరూ ఆందోళనకు గురయ్యారు.
ఎయిర్ హోస్టెస్ ముఖాల్లో భయం కనిపించింది. వారంత దేవుడికి ప్రార్థనలు చేస్తున్నారు. పైలట్స్ సైతం టెన్షన్ పడుతున్నారు. నా సోదరుడు సోహైల్‌ని చూస్తే హాయిగా నిద్ర పోతున్నాడు. ఒక 45 నిమిషాల పాటు విమానంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇక అంతా ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. కానీ 45 నిమిషాల తర్వాత మళ్లీ సాధారణ పరిస్థితికి వచ్చింది. ప్రయాణికులంత రిలాక్స్ అయ్యారు. అందరిలో మళ్లీ నవ్వు ముఖాలు కనిపించాయి” అని చెప్పుకొచ్చాడు.