Last Updated:

Vinaro Bhagyamu Vishnu Katha : కిరణ్ అబ్బవరం “వినరో భాగ్యము విష్ణు కథ” మూవీ రివ్యూ..!

Vinaro Bhagyamu Vishnu Katha : కిరణ్ అబ్బవరం “వినరో భాగ్యము విష్ణు కథ” మూవీ రివ్యూ..!

Cast & Crew

  • కిరణ్ అబ్బవరం (Hero)
  • క‌శ్మీరా పరదేశి (Heroine)
  • మురళీ శర్మ, ఎల్బీ శ్రీరామ్, ప్రవీణ్, 'శుభలేఖ' సుధాకర్, తదితరులు (Cast)
  • మురళీ కిషోర్ అబ్బూరు (Director)
  • 'బన్నీ' వాస్ (Producer)
  • చైతన్ భరద్వాజ్ (Music)
  • డేనియల్ విశ్వాస్ (Cinematography)
3

Vinaro Bhagyamu Vishnu Katha : యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. రాజావారు రాణిగారు, ఎస్ ఆర్ కళ్యాణ మండపం, సమ్మతమే సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్. మంచి యూత్ ఫుల్ సినిమాలతో యూత్ లో క్రేజ్ ని సంపాదించుకున్న ఈ నటుడు.. ఈసారి ఒక కొత్త కాన్సెప్ట్ రాబోతున్నాడు. గత ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ హీరో.. ఈ సంవత్సరం మొదటి లోనే మరో మూవీని ప్రేక్షకుల ముందు తీసుకు వస్తున్నాడు. కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం “వినరో భాగ్యం విష్ణు కథ”.

ఈ సినిమాలో హీరోయిన్ గా తమిళ్ బ్యూటీ కాశ్మీర నటిస్తుంది. ఈ బ్యూటీ తెలుగులో ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి. మురళి శర్మ, శుభలేఖ సుధాకర్, ప్రవీణ్, పమ్మి సాయి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కొత్త దర్శకుడు మురళి కిషోర్ అబ్బుర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. మొదటిసారి గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థలో కిరణ్ నటిస్తున్నాడు. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. మహా శివరాత్రి సందర్భంగా నేడు (ఫిబ్రవరి 18) న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో మీకోసం ప్రత్యేకంగా..

సినిమా కథ..

మంచి తనం, ఇతరులకు సహాయం చేసే లక్షణాలు ఉన్న అబ్బాయి విష్ణు (కిరణ్‌ అబ్బవరం). ఒక లైబ్రరీలో పనిచేస్తుంటాడు. చిన్నప్పుడే అమ్మానాన్న చనిపోతారు. దర్శనా (కశ్మీరా ప‌ర్ధేశీ) ఓ యూట్యూబర్. ఎన్ని వీడియోలు చేసినా వ్యూస్ మాత్రం రావు. ఫేమస్ కావడం కోసం నెంబర్ నైబర్స్ (ఫోన్ నంబర్‌కు ఒక అంకె ముందు, వెనుక)కి ఫోన్ చేసి వాళ్ళతో వీడియో ప్లాన్ చేస్తుంది. దర్శనా ఫోన్ నెంబర్ నైబర్స్ ఎవరంటే… ఒకరు, శర్మ (మురళీ శర్మ), ఇంకొకరు, విష్ణు. ఈ క్రమంలోనే వీళ్ళు ముగ్గురు కలిసి పాపులర్‌ తెలుగు పాటలకు డాన్సులు చేస్తూ బాగా పాపులర్‌ అయిపోతారు. ఈ క్రమంలో దర్శణ, విష్ణు ప్రేమలో పడతారు. అయితే అనుకోకుండా దర్శణ మరింత క్రేజ్ కోసం లైవ్‌ మర్దర్‌ ప్లాన్‌ చేస్తుంది. ఫ్రాంక్‌గా శర్మని లైవ్‌ మర్దర్‌ చేయాలనుకుంటుంది. కానీ ఈ ఫ్రాంక్‌ కాస్త నిజం అవుతుంది. దీంతో దర్శణకి ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది. దర్శన జైలుకి వెళ్ళడానికి కారణం ఏంటి ? ఆమెను ఇరికించింది ఎవరు..? విష్ణు కోసం ఎన్ఐఏ & ఓ మంత్రి ఎందుకు వెతుకుతున్నారు?  జైలుకు వెళ్ళిన దర్శనను బయటకు తీసుకు రావడం కోసం విష్ణు ఏం చేశాడు? ముంబై గ్యాంగ్ స్టర్ రాజన్ (శరత్ లోహితస్వ)కు, విష్ణుకు సంబంధం ఏమిటి? అనేది మిగతా సినిమా.

 

 

మూవీ విశ్లేషణ (Vinaro Bhagyamu Vishnu Katha)..

కిరణ్‌ అబ్బవరం ఏదో ఒక మంచి సందేశాన్ని అందించే కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ సారి నెంబర్‌ నైబరింగ్‌ అనే వినూత్న కాన్సెప్ట్ తో వచ్చాడు. కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా మూవీ మాత్రం రెగ్యూలర్‌ కమర్షియల్‌ వేలోనే ఉండి ఆడియన్స్ ని అలరిస్తుంది. ఫస్టాఫ్‌ మొత్తం ఎంటర్‌టైనింగ్‌ వేలో లవ్ స్టోరీలా తీసుకెళ్లాడు దర్శకుడు. హీరో హీరోయిన్ల మధ్య లవ్‌ ట్రాక్‌, హీరోయిన్‌, మురళీ శర్మల మధ్య వచ్చే సీన్లే బాగా ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నాయి. ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ అదిరిపోయేలా ఉంటుంది.  సెకండాఫ్‌కి కావాల్సినంత బూస్ట్ అప్ ఈ ట్విస్ట్ ఇస్తుంది. ఇక్కడ నుంచి దాని వెనుక పెద్ద కుట్ర ఉందని తెలుసుకున్న హీరో దాన్ని ఛేదించేందుకు, జైల్లో శిక్ష అనుభవిస్తున్న హీరోయిన్‌ని నిర్ధోషిగా బయటకు తీసుకు వచ్చేందుకు చేసే ప్రయత్నాలు సినిమా వేగాన్ని కొంచెం తగ్గించాయి. ఇక ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ సినిమాకి మరో హైలైట్‌గా నిలుస్తుంది. మళ్ళీ ఆ తర్వాత సినిమా వేగం పుంజుకుంటుంది. నెంబర్‌ నైబరింగ్‌తో టెర్రరిస్ట్ లను ట్రాక్‌ చేయడం వంటి సన్నివేశాలు బాగున్నాయి. అయితే సినిమా ముగిసిపోయిందని అంతా భావించిన తర్వాత టెర్రరిస్టుల ఎపిసోడ్‌ పెట్టడం సినిమా ట్రాక్‌ తప్పిందా అనే ఫీలింగ్‌ తెప్పిస్తాయి. కానీ మెయిన్‌ స్టోరీకి పారలల్‌గా ఇతర కథను నడిపించడం, వాటిని లింక్‌ చేసే విషయంలో ఒకే అనిపిస్తాయి. క్లైమాక్స్ లోని చివరి ట్విస్ట్ సైతం బాగుంది. ఓవరాల్‌గా సినిమా సరదాగా పోతూ.. మధ్య మధ్యలో కావాల్సిన ట్విస్ట్ లను ఇచ్చి ప్రేక్షకులకు కావాల్సిన ఫుల్ మీల్స్ ఇచ్చిందని చెప్పొచ్చు.

నటీనటులు ఎలా చేశారంటే..?

పక్కింటి కుర్రాడిలా అనిపించే కిరణ్.. తన సహజ నటనతో ఈ సినిమాలో కూడా చాలా బాగా నటించారు. మరోవైపు ఇమేజ్ తాలుకూ సన్నివేశాలు ఫ్యాన్స్ ఎంజాయ్‌ చేసేలా ఉన్నాయి. దర్శణ పాత్రలో కాశ్మీరి పరదేశీ బాగా చేసింది. శర్మగా మురళీ శర్మ ఇరగదీశాడు. మిగిలిన పాత్రలు ఉన్నంతలో ఓకే అనిపిస్తాయి. దర్శకుడు మురళీ కిషోర్‌ కాంప్లికేటెడ్‌ కథని చాలా బాగా డీల్‌ చేశాడు. అప్‌ కమింగ్‌ డైరెక్టర్‌ అయినా మూడు పారలల్‌ స్టోరీలను లింక్‌ చేసిన తీరు బాగుంది. కాస్త అక్కడక్కడా తడబడినప్పటికి మూవీ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా ఉండటం విశేషం. ఏదేమైనా దర్శకుడు మంచి ప్రయత్నం చేశాడని చెప్పొచ్చు. చైతన్య భరద్వాజ్‌ సంగీతం సినిమాకి బాగుంది. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, పాటలు బాగున్నాయి. మార్తాండ్‌ కె వెంకటేష్‌ ఎడిటింగ్‌.. తిరుమల వెంకటేశ్వర స్వామి, ఏడుకొండలను చూపించిన తీరు బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇండస్ట్రికి వచ్చే కొత్త వారిని ఎంకరేజ్ చేయడానికి.. మంచి కథలను ప్రేక్షకులకు అందించడానికి గీతా ఆర్ట్స్ ఎప్పుడు ముందుంటుందని మరోసారి అల్లు అరవింద్, బన్నీ వయసు నిరూపించారు.

కంక్లూజన్..

ప్రేక్షకులు మెచ్చే మిక్స్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్..

 

 

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

ఇవి కూడా చదవండి: