KA Movie OTT: మరో ఓటీటీకి వచ్చిన కిరణ్ అబ్బవరం ‘క’ – ఎక్కడ చూడాలంటే!

Kiran Abbavaram KA Movie OTT Streaming: టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ మరో ఓటీటీలోకి వచ్చింది. గతేడాది రిలీజైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. కిరణ్ అబ్బవరం హీరోగా నయన్ సారిక, తన్వీ రామ్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం పీరియాడికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుజీత్-సందీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మించారు.
అమెజాన్ ప్రైంలో స్ట్రీమింగ్
కిరణ్ అబ్బవరం కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిని ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికే ఒక ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న క మూవీ తాజాగా మరో ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైంలో ఈ సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చింది. డాల్బీ విజన్, 4కే అట్మాస్ టెక్నాలజీ నుంచి ఓటీటీలో6కి వచ్చిన ఫస్ట్ తెలుగు సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
‘క’ కథేంటంటే..
అభినయ వాసుదేవ్(కిరణ్ అబ్బవరం) అనాథ. అనాథాశ్రమంలో పెరిగిన అతడికి పక్కవాళ్ల ఉత్తరాలు చదివే అలవాటు ఉంటుంది. ఇక పోస్ట్‌మ్యాన్ అయితే అన్ని ఉత్తరాలు చదవచ్చనే ఆశతో ఆ ఉద్యోగంలో చేరుతాడు. జాబ్ కోసం తన పెంపుడు కుక్కతో క్రిష్ణగిరి అనే ఊరికి వెళతాడు. అక్కడ పోస్ట్ మాస్టర్ రామారావు అనుమతితో పోస్ట్ మ్యాన్ అసిస్టెంట్‌గా జాయిన్ అవుతాడు. అదే గ్రామంలో ఉంటూ రామారావు గారి అమ్మాయి సత్యభామతో(నయని సారిక) ప్రేమలో పడతాడు.
అయితే ఆ గ్రామంలో వరుసగా అమ్మాయిలు మిస్ అవుతుంటారు. వారిని కిడ్నాప్ చేసేదేవరు? క్రష్ణగిరి గ్రామానికి చెందిన అమ్మాయిలే ఎందుకు కనిపించకపోతున్నారనేది సస్పెన్స్ ఉంటుంది. అయితే ఉత్తరాలు చదివే అలవాటు ఉన్న వాసుదేవ్ ఓ ఉత్తరం ద్వారా నిజం తెలుసుకుంటాడు. ఆ ఊరు పెద్దే అమ్మాయి మిస్సింగ్‌కి కారణమని తెలుసుకుంటాడు. అది తెలిసి ఓ ముసుగు వ్యక్తి వాసుదేవ్‌పై దాడి చేస్తాడు. అతడిని కొట్టి ఓ చికటి రూంలో బంధిస్తాడు. ఆ తర్వాత ఏమైందనేది అనేది ‘క’ కథ. వాసుదేవ్‌తో పాటు రాధని (తన్వీ రామ్) కూడా బంధిస్తారు. ఇంతకి వీరిద్దరి మధ్య ఉన్ సంబంధం ఏంటీ? వారిని కిడ్నాప్ చేసిన ఆ ముసుగు గ్యాంగ్? ఎవరు.. లాలా, అబిద్ షేక్ ఎవరనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఇవి కూడా చదవండి:
- Chhaava OTT Release: టాలీవుడ్ ఆడియన్స్‌కి గుడ్‌న్యూస్ – ఛావా తెలుగు వెర్షన్ వచ్చేసింది, స్ట్రీమింగ్ ఎక్కడంటే..?