Published On:

Kiran Abbavaram: రాణిగారి సీమంతం.. రాజావారి ఆనందం

Kiran Abbavaram: రాణిగారి సీమంతం.. రాజావారి ఆనందం

Kiran Abbavaram: టాలీవుడ్ కుర్ర హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. క హిట్ తరువాత జోరు పెంచిన కిరణ్.. మంచి కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ మధ్యనే దిల్ రూబా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ, అది ఆశించినంత ఫలితాన్ని అందుకోలేకపోయింది.

 

ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. కిరణ్ అబ్బవరం.. తన మొదటి సినిమా రాజావారు రాణిగారు హీరోయిన్ రహస్య గోరఖ్ ను ప్రేమించి.. 2024 లో ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డ ఈ జంట ఆ తర్వాత డేటింగ్ లో ఉంటూ ఇల్లు కట్టాక పెళ్లి చేసుకున్నారు.

 

ఇక గతేడాది చివర్లో కిరణ్, రహస్య అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. రహస్య ప్రెగ్నెంట్ అని.. తము ఇద్దరం ముగ్గురం కాబోతున్నామని చెప్పుకొచ్చారు. ఇక దీంతో అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా రహస్య సీమంతం అంగరంగ వైభవంగా జరిగినట్లు తెలుస్తోంది. రహస్య తన సీమంతం ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.

 

బ్లూ కలర్ పట్టుచీర కట్టుకొని రహస్య బేబీ బంప్ తో ఫోటో కి పోజ్ ఇచ్చింది. ఈ ఫోటోలో ఆమె ఎంతో అందంగా కనిపించింది. ఇక ఇంకో ఫోటోలో భర్త కిరణ్ చేతిని పట్టుకొని నవ్వుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. త్వరలోనే రహస్య పండంటి బిడ్డకు జన్మ ఇవ్వనుంది. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు వదినమ్మ ఎంత అందంగా ఉందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.