Taraka Rama: సినీ పరిశ్రమలో కొత్త ప్రయోగం ‘పూర్ణ చంద్రరావు’

Taraka Rama A New Experiment in The History of Indian Cinema Poorna Chandar Rao: తెలుగు సినీ పరిశ్రమలో ప్రేక్షకులు కొత్త కొత్త కథలను ప్రోత్సహిస్తుంటారు. అయితే ఇక్కడి ప్రేక్షకులు కొన్నిసార్లు కొన్ని విషయాల గురించి అసలు మాట్లాడటమనేది సాహసమే అని చెప్పాలి. ఇలాంటి వాటికి చెక్ పెడుతూ వస్తున్న ఓ కొత్త ప్రయోగాత్మక చిత్రమే ‘పూర్ణ చంద్రరావు’. భారతీయ సినిమా చరిత్రలోనే తొలిసారి ‘పోర్న్ అడిక్షన్’.. అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ తరహాలో ఎత్తిచూపిస్తూ తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు తారక రామ దర్శకత్వం వహిస్తుండగా.. ‘ఏం చేస్తునావ్’ సినిమా ఫేమ్ హీరో విజయ్ రాజ్ కుమార్ నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా నటించడంతోపాటు ఈ డిఫరెంట్ కాన్సెప్ట్‌కు రైటర్ కూడా ఆయనే కావడం విశేషం.
తాజాగా, ఈ సినిమా నుంచి మేకర్స్ అప్డేట్ ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ సరికొత్తగా ఆకట్టుకుంటోంది. ఇక, ఈ సినిమా మామూలులుగా ఉండదని అర్థమవుతుంది. ఇందులో సోఫా మీద అర్ధనగ్నంగా కూర్చొని ల్యాప్‌టాప్ చూస్తున్న హీరో, వెనుక స్టీవ్ జాబ్స్, ఎలాన్ మస్క్ ఫోటోలు కనిపించడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఫోటో చూస్తే ప్రేక్షకులకు ఓ మెసేజ్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది.టెక్నాలజీ, పోర్న్ అడిక్షన్, మానసిక స్థితి ఇలా అన్నీ కలిపి ఓ డీప్ అర్ధం చెప్పేలా ఉంది.
అయితే సాధారణంగా మద్యం, డ్రగ్స్, సోషల్ మీడియా అడిక్షన్‌పై ఎన్నో సినిమాలు చూశాం. కానీ పోర్న్ అడిక్షన్‌పై ఓ ఫీచర్ ఫిల్మ్ రావడం ఇదే తొలిసారి. ఈ సినిమాను ఎంటర్టైన్మెంట్ అండ్ థాట్ప్రొవోకింగ్ స్టైల్‌లో చూపించనుంది. అంతకుముందు ‘అనగనగా ఆస్ట్రేలియా లో’ సినిమాతో కొత్తగా ప్రయత్నం చేసిన తారక రామ.. ఈసారి సరికొత్తగా మరింత అడుగు ముందుకు వేసి ఓ బోల్డ్ కథనం సెలక్ట్ చేసుకోవడం సాహసమేనని చెప్పాలి. అయతే హీరో కూడా తన తెలిసిన కొన్ని అనుభవాలను ఆధారంగా చేసుకుని స్టోరీ రాసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫస్ట్ లుక్ చూసిన కొంతమంది “ఇది చాలా మందికి అవసరమైన కథ” అని కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా “టాలీవుడ్ చరిత్రలో ఇలాంటి ప్రయోగాలు చాలా అరుదు” అని పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమాను సహాన ఆర్ట్ క్రియేషన్స్ పై మాధవి మంగపతి అండ్ యారీక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఇలాంటి బొల్డ్ కాన్సెప్ట్ పై సినిమా తీయాలంటే చాలా ధైర్యం చేయాలి. ఒక పోస్టర్‌తోనే ఎంతోమందిని ఆకట్టుకున్న ఈ ‘పూర్ణ చంద్రరావు’ భవిష్యత్తులో ఇంకెన్ని ప్రయోగాలు చేస్తాడో చూడాలి మరి.