Last Updated:

Coolie: కూలీ పని ముగిసింది.. ఇక వేటకు సిద్దమే

Coolie: కూలీ పని ముగిసింది.. ఇక వేటకు సిద్దమే

Coolie: సూపర్ స్టార్ రజినీకాంత్ 74 ఏళ్ల వయస్సులో కూడా వరుస సినిమాలు చేస్తూ కుర్రహీరోలకు పోటీగా నిలబడుతున్నాడు. జైలర్ తరువాత జోరు పెంచిన రజినీ  ప్రస్తుతం కూలీ సినిమాలో నటిస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు.

 

కూలీ సినిమాలో రజనీతో పాటు శివరాజ్‌కుమార్, శృతి హాసన్, నాగార్జున, ఉపేంద్ర వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా అందాల హాట్ బ్యూటీ పూజా హెగ్డే ఈ సినిమాలో ఒక ఐటెంసాంగ్ లో నటించబోతుంది.  ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి వివిధ లొకేషన్లలో షూటింగ్ చేశారు. చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

 

ఇక తాజాగా కూలీ చిత్రబృందం ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్ ను చెప్పుకొచ్చింది. ఎట్టేకలకు కూలీ షూటింగ్ వ్రాప్ అయినట్లు టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా సెట్ నుంచి కొన్ని ఫోటోలు, వీడియోలను మేకర్స్ రిలీజ్ చేస్తూ పని షూటింగ్ పూర్తయిందని తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

రజినీకాంత్ సినిమా అంటే మ్యూజిక్ అనిరుధ్ రవిచంద్రన్ ఉండాల్సిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రం లోకేష్ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతోందని సమాచారం.ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. 2025 సమ్మర్‌లో కూలీ విడుదల కానుందని టాక్ నడుస్తోంది.

 

కూలీ సినిమాపై ప్రేక్షకులు అంచనాలను పెట్టుకోవడానికి కారణం అక్కినేని నాగార్జున.  హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న కింగ్.. తన పంథా మార్చుకొని కీలక పాత్రల్లో నటించడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే తెలుగులో కుబేర సినిమాతో వస్తున్న నాగ్.. కూలీలో కూడా సపోర్టింగ్ రోల్ లో నటించబోతున్నాడు. మరి ఈ సినిమాతో నాగ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.