Operation Akarsh: తెరాస ఎమ్మెల్యేల ప్రలోభాల డీల్ లో కీలక మలుపు.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన భాజపా
మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎపిసోడ్ లో కీలక మలుపు చోటుచేసుకొనింది. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై భాజపా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Hyderabad: మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎపిసోడ్ లో కీలక మలుపు చోటుచేసుకొనింది. ఎమ్మెల్యేల కొనుగోలు అంశం పై భాజపా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
8మందిని ప్రతివాదులుగా చేర్చిన భాజపా విచారణకు ప్రత్యేక బృందాన్ని నియమించాలని పిటిషన్ లో పేర్కొనింది. తెలంగాణ ప్రభుత్వం, డీజీపి, సైబరాబాద్ సీపి, రాజేంద్రనగర్ ఏసీపి, మొయినాబాద్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, కేంద్రం, సీబీఐలను భాజపా ప్రతివాదులుగా చేర్చింది. ఘటనలో పోలీసుల వ్యవహరాశైలిపై భాజపా అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రత్యేక విచారణ కమిటీని కోర్టు పర్యవేక్షణలో ఏర్పాటు చేయాలని భాజపా హైకోర్టును కోరింది.
ఈ దినం ఉదయం భాజపా నేతలు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోర్టు మెట్లు ఎక్కుతున్నామని పేర్కొన్న కొద్ది గంటల్లోనే హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో, డీల్ వ్యవహారాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని భావించిన తెరాస శ్రేణుల వెన్నులో ఒక్కసారిగా శీతాకాలపు చలి మొదలైంది.
ఇది కూడా చదవండి: Operation Akarsh: ఆకర్ష్ డీల్ ఘటన.. సీఎం కేసిఆర్ పై కేసు నమోదు చేయాలి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి