Last Updated:

Basit Kalam Siddiqui: ఐఐటీలో చేరాలనుకున్నాడు.. ఐఎస్ కి కీలక రిక్రూటర్‌గా మారాడు

ఐఐటీలో చేరాలని కలలు కన్న యువకుడు చివరికి ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)కి కీలక రిక్రూటర్‌గా మారాడు. బుధవారం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) వారణాసిలో అరెస్ట్ చేసిన బాసిత్ కలాం సిద్దిఖీ జీవితాన్ని విధి మలుపు తిప్పింది.

Basit Kalam Siddiqui: ఐఐటీలో చేరాలనుకున్నాడు.. ఐఎస్ కి కీలక రిక్రూటర్‌గా మారాడు

Varanasi: ఐఐటీలో చేరాలని కలలు కన్న యువకుడు చివరికి ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)కి కీలక రిక్రూటర్‌గా మారాడు. బుధవారం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) వారణాసిలో అరెస్ట్ చేసిన బాసిత్ కలాం సిద్దిఖీ జీవితాన్ని విధి మలుపు తిప్పింది.

వారణాసికి చెందిన బాసిత్ కలాం సిద్ధిఖీ ఐఐటీ కోచింగ్ కోసం కోటాకు వెళ్లాడు, అయితే కరోనా మహమ్మారి అతని ప్రణాళికలను నాశనం చేసింది. దీనితో అతను తిరిగి ఇంటికి రాక తప్పలేదు. తరువాత అతను అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కోటా కు తిరిగి రాలేకపోయాడు. ఇస్లామిక్ స్టేట్ కోసం పనిచేస్తున్న కొంతమంది వ్యక్తులతో పరిచయం ఏర్పడిన తర్వాత యువతను సమూలంగా మార్చేందుకు సిద్ధిఖీ సోషల్ మీడియా యాప్‌లలో వివిధ గ్రూపులను ప్రారంభించాడు.

మంచి సాంకేతిక పరిజ్జానమున్న సిద్దిఖీ పేలుడు పదార్దాల వినియోగం పై కూడ మంచి అవగాహన పెంచుకున్నట్లు తెలుస్తోంది. అతను దీనిపై గ్రూప్‌లోని ఇతరులతో కూడా పంచుకున్నాడని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. ఒక పేలుడు పదార్థాన్ని తయారు చేసేందుకు సిద్ధిఖీ ప్రయత్నిస్తున్నాడని మరియు ఐఈడీని సృష్టించేందుకు ఉపయోగించే ఇతర ప్రాణాంతక రసాయనాల పై అవగాహన పొందేందుకు ప్రయత్నిస్తున్నాడని ఎన్ ఐ ఏ కనుగొంది. బాసిత్ కలాం సిద్ధిఖీ భారతదేశం నుండి ఐసిస్ తరపున యువకుల రిక్రూట్‌మెంట్‌లో చురుకుగా పాల్గొన్నట్లు తేలింది. దీనికోసం వాయిస్ ఆఫ్ ఖొరాసన్’ అనే ఆన్ లైన్ మ్యాగజైన్ ను కూడ నిర్వహిస్తున్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.

ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న అతని ఐఎస్ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు, అతను పేలుడు ‘బ్లాక్ పౌడర్’ ని రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాడు.ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైసెస్ ( ఐఈడి) తయారీకి ఉపయోగించే ఇతర ప్రాణాంతక రసాయన పదార్థాల వాడకంపై అవగాహన పొందాడు. ఎన్ఐఏ తన సోదాల సమయంలో, ఐఈడిలు మరియు పేలుడు పదార్థాలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, పెన్ డ్రైవ్‌లు మొదలైన వాటి తయారీకి సంబంధించిన చేతితో రాసిన నోట్సను స్వాధీనం చేసుకుంది. అయితే సిద్దిఖీ కోటాలో ఉన్న సమయంలో ఐఎస్ తో టచ్ లోకి వచ్చాడా లేదా తరువాత అతను ఈ సంస్ద తరపున పనిచేయడం మొదలు పెట్టాడా అన్నది తెలియవలసి ఉంది.

ఇవి కూడా చదవండి: