Published On:

PM Modi: మహిళల అభివృద్ధే లక్ష్యంగా పనిచేశాం.. ప్రధాని మోదీ

PM Modi: మహిళల అభివృద్ధే లక్ష్యంగా పనిచేశాం.. ప్రధాని మోదీ

PM Modi Government Focus on Women’s Empowerment: మహిళల అభివృద్ధే లక్ష్యంగా పనిచేశామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిని గుర్తు చేశారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు గడుస్తోంది. ఈ సమయంలో సాధించిన విజయాలను చెప్పుకొచ్చారు.

ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన పథకాలు, ప్రోగ్రామ్స్ వంటివి మరోసారి గుర్తు చేశారు. అంతేకాకుండా మహిళలు సాధించిన విజయాలను పంచుకున్నారు. కాగా, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఈ మేరకు మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు జరిగి రేపటికి ఏడాది కానుంది.